breaking news
Nexus 6
-
ఇండియాలోకి వచ్చేశాయి.!
గూగుల్ నెక్సస్ 6 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే గూగుల్-మోటరోలా‘నెక్సస్ 6’ భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈ మంగళవారం అర్ధరాత్రి నుంచి నెక్సస్ అమ్మకాలు మొదలయ్యాయి. ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా నెక్సస్ 6 అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి పొందడానికి అవకాశం ఉంది. నెక్సస్ 6 రెండుమోడల్స్లో అందుబాటులోకి వచ్చింది. ఒకటి 32 జీబీ, మరోటి 64 జీబీ. 32 జీబీ నెక్సస్ 6 ధర 43,999 రూపాయలు కాగా, 64 జీబీ స్మార్ట్‌పోన్ ధర 48,999 రూపాయలు. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 4, యాపిల్ ఐ ఫోన్ 6 ప్లస్స్థాయి ఫోన్ ఇది. సైజ్ విషయంలో వాటికన్నా కొంచెం పెద్దగానే ఉండే నెక్సస్ 6.. 13 మెగాపిక్సల్ రేర్ కెమెరాతో 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ ఓఎస్‌పై పనిచేస్తుంది. లెనోవో యోగా ట్యాబ్లెట్ 2 ప్రో లెనోవో యోగా ట్యాబ్లెట్ సిరీస్‌లో సరికొత్త ట్యాబ్లెట్ భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. యోగా ట్యాబ్లెట్2 ప్రో అనే ఈ డివైజ్ అమ్మకాలు మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో మొదలయ్యాయి. క్యూహెచ్డీ డిస్ప్లేతో రూపొందిన ఈ ట్యాబ్లెట్ ఏకంగా 13 ఇంచెస్ డిస్ప్లేతో చాటంత ఉంటుంది. ఎయిట్ వాట్ సౌండ్ సిస్టమ్, సబ్ వూఫర్లు ఈ ట్యాబ్లెట్ ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డివైజ్‌కు వీడియో చాటింగ్ కోసం 1.6 ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని ధర దాదాపు 35 వేల రూపాయలు. -
ఐఫోన్ 6 తో పోటికి గూగుల్ నెక్సస్ 6 సిద్ధం!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మార్కెట్లోకి కొత్త మొబైల్ ఫోన్లు నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజాగా గూగుల్ రూపొందించిన నెక్సస్ 6, నెక్సస్ 9 ఫోన్లను యూఎస్ తోపాటు ఇతర దేశాల్లో కూడా విడుదల చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. ఆపిల్ కంపెనీ నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటిని తట్టుకునేందుకు కొత్త ప్రోడక్టులను మార్కెట్ తీసుకురావడానికి అక్టోబర్ 16 తేదిన నిర్వహించే ఓ సదస్సులో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గూగుల్ తో కలిసి మోటోరోలా రూపొందిస్తున్న నెక్సస్ 6 ఫోన్ అక్టోబర్ చివరి వారంలో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని.. నవంబర్ మొదటి వారంలో స్టోర్స్ లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. మొబైల్ మార్కెట్ లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ భారత్ లో ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్ వినియోగంలో భారత్ వేగంగా దూసుకుపోతుందని గణాంకాల్ని ఇటీవల ఓ కంపెనీ విడుదల చేసింది.