New Govt
-
ఇరాన్ మాజీ యువరాజు సంచలన ప్రకటన
వాషింగ్టన్ డీసీ: ప్రస్తుతం ఇరాన్ యుద్ధంతో అట్టుడికి పోతుంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఆ దేశం అతలాకుతలంగా మారింది. సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణంతో రాజకీయంగా సైతం సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలోనే ఇరాన్ బహిష్కృత రాజు రెజా పహ్లావి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని సంచలన ప్రకటన చేశారు.టెహ్రాన్ మునుపెన్నడూ లేని సంక్షోభాలని చూస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతమవుతున్న ఆ దేశం రాజకీయంగా తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటుంది. యుద్ధం ప్రారంభం కావడానికి అణుచర్చల విఫలంతో పాటు ఆ దేశంలో ప్రజలు జరిపిన నిరసనలు సైతం ఒక కారణం. ఇస్లామిక్ ప్రభుత్వ కఠిన చట్టాలు, అవినీతిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై నిరసనలతో రోడ్లెక్కారు. దీంతో ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో వారిని అణిచివేసింది. వేలాది మందిని కాల్చి చంపింది. ఈ విషయంలో మెుదటి నుంచి ఇరాన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన ట్రంప్ ఇదే సాకుగా భావించి యుద్ధాన్ని ప్రకటించారు.అయితే యుద్దం ప్రారంభంలోనే ఆ దేశ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీని హతమార్చారు. ప్రస్తుతం సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీని సైతం లేపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ బహిష్కృత యువరాజు రెజాపహ్లవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ప్రకటనలో ఆయన మాట్లాడుతూ"ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే వెను వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. నా నాయకత్వంలో ఇరాన్‌ని పాలించడానికి ప్రతినిధి వర్గం సిద్ధంగా ఉంది. కొద్దికాలంలోనే ఇరాన్లో శాంతి భద్రతలు, స్వేచ్ఛా తిరిగి పునరుద్ధరిస్తాం." అని ప్రకటనలో తెలిపారు.దేశంలో తిరిగి శాంతిని పునరుద్ధరించడానికి స్థానికంగా ఉన్న వారితో పాటు విదేశాలలో ఉన్న నిపుణులను నియమించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ అభివృద్ధి కోసం “ఇరాన్ ప్రాస్పెరిటీ ప్రాజెక్ట్” అనే కార్యక్రమం కూడా రూపొందించబడిందని ఇస్లామిక్ ప్రభుత్వం పడిపోయిన మొదటి 180 రోజుల్లో చేపట్టాల్సిన చర్యలు, కొత్త రాజ్యాంగం రూపకల్పన, ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) వంటి అంశాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య పాలనతోనే ఇరాన్లో అభివృద్ధి సాధ్యం అని రెజా పహ్లవీ పేర్కొంటున్నారు.రెజా పహ్లవీ నేపథ్యంకాగా ప్రస్తుతం రెజా పహ్లవీ అమెరికాలో నివాసం ఉంటున్నారు. 1979లో మెుహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇరాన్లో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది.దీంతో అక్కడ రాజరిక వ్యవస్థ రద్దై రెజా షా పహ్లవీ దేశాన్ని విడిచి పారిపోయాడు. అనంతరం అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆసమయంలో రెజా పహ్లవీ అమెరికాలో ఫైలట్ శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు. -
తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రేపు(గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర కేబినెట్‌తో పాటు ఇతర కీలక పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యం కల్పించే దిశలో కసరత్తు చేస్తోంది. మరోవైపు, మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్ సాగర్‌రావుతో పాటు పలువురు అధిష్టానం పెద్దలను కలిశారు. డీకే శివకుమార్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం. అధిష్టానంపైనే సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. మంత్రి వర్గ కూర్పుపై ఢిల్లీలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. వరుసగా ఏఐసీసీ నేతలతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్‌తో ప్రమాణం చేసేది ఆరుగురేనని సమాచారం. ఒక డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ ఎవరనేది తేలాక.. మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు తెలిసింది. తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ? 1. సీఎం - రేవంత్ రెడ్డి 2. డిప్యూటీ సీఎం - భట్టి విక్రమార్క 3. దామోదర రాజనర్సింహ ( మాదిగ) 4.గడ్డం వివేక్ ( మాల) 5. సీతక్క( ఎస్టీ) 6. పొన్నం ప్రభాకర్(గౌడ్) 7. కొండా సురేఖ ( మున్నూరు కాపు) 8. ఉత్తం కుమార్ రెడ్డి 9. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 10. కోమటి రెడ్డి వెంకట రెడ్డి 11. మల్ రెడ్డి రంగారెడ్డి 12. తుమ్మల నాగేశ్వర రావు ( ఖమ్మం) 13. దుద్దిల్ల శ్రీధర్ బాబు( బ్రాహ్మణ) 14. షబ్బీర్ ఆలీ 15. జూపల్లి కృష్ణారావు 16. శ్రీహరి ముదిరాజ్ 17. వీర్లపల్లి శంకర్ (ఎంబిసి) స్పీకర్ : రేవూరి ప్రకాశ్ రెడ్డి / శ్రీధర్ బాబు చదవండి: మాటిచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సీఎంగా.. -
కొత్త సర్కారుకు.. సవాళ్ల స్వాగతం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి పలు సవాళ్లు స్వాగతం పలకనున్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. మందగమనానికి అడ్డుకట్ట వేయడం, ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవడం, మొండిబాకీల సమస్యల నుంచి బ్యాంకులను గట్టెక్కించడం మొదలైన వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుందని వివరించారు. అలాగే కంపెనీల కోసం స్థల సమీకరణ నిబంధనలను సరళతరం చేయడం, కార్మిక సంస్కరణలు చేపట్టడంతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం ఎదుర్కొంటున్న నిధుల సమస్యలను తీర్చడమూ కీలకమని పేర్కొన్నారు. అటు కరెంటు అకౌంటు లోటు (సీఏడీ)ని కట్టడి చేయడంతో పాటు ఉద్యోగార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడంపైనా దృష్టి సారించాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అమలు చేస్తున్న వస్తు, సేవల పన్నులు, దివాలా చట్టం వంటి సంస్కరణల నుంచి ప్రజలకు తక్షణ ప్రయోజనాలు అందించేందుకు కేంద్రం ప్రయత్నించాల్సి ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా–పసిఫిక్ విభాగం చీఫ్ ఎకానమిస్ట్ షాన్ రోష్ చెప్పారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అసెట్ క్వాలిటీ సమస్యలను పరిష్కరించడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో నెలకొన్న ఒత్తిళ్లను తొలగించడంపైనా కసరత్తు చేయాలని పేర్కొన్నారు. ‘ప్రైవేట్ రంగానికి నిధులను అందుబాటులోకి తెచ్చేందుకు, వృద్ధికి ఊతమిచ్చేలా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటివి దోహదపడతాయి‘ అని రోష్ తెలిపారు. వృద్ధి రేటు మందగించడానికి అడ్డుకట్ట వేయాలని, ద్రవ్యోల్బణాన్ని ఎగదోయకుండా దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాలు రూపొందించాలని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ చీఫ్ ఎకానమిస్ట్ దేవేంద్ర పంత్ తెలిపారు. ఆర్థిక స్థిరత్వా న్ని దెబ్బ తీయకుండా ప్రభుత్వ పెట్టుబడుల వ్యూ హాలు ఉండాలని, వ్యవసాయ రంగంలో ఒత్తిడిని తొలగించేందుకు, ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. క్యాడ్ కట్టడి కీలకం.. వాణిజ్య యుద్ధభయాలు, అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటం, ఎగుమతులు మందగిస్తుండటం వంటి అంశాల కారణంగా కరెంటు ఖాతా లోటు (క్యాడ్)పై ప్రతికూల ప్రభావం పడుతోందని పీడబ్ల్యూసీ ఇండియా లీడర్ (పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ విభాగం) రాణెన్ బెనర్జీ చెప్పారు. దీన్ని కట్టడి చేయడం కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా ఉంటుందని వివరించారు. దేశంలోకి విదేశీ మారకం రాక, పోక మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా వ్యవహరిస్తారు. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 2.5 శాతానికి (దాదాపు 16.9 బిలియన్ డాలర్లు) పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఇది జీడీపీలో 2.1 శాతంగా (13.7 బిలియన్ డాలర్లు)గా ఉంది. వాణిజ్య యుద్ధాల నుంచి ప్రయోజనం పొందాలి... అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న పరిస్థితులను భారత్ తనకు అనుకూలంగా మల్చుకోవడంపై దృష్టి పెట్టాలని రోష్ అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఇతర దేశాలతో దీటుగా పోటీపడేం దుకు పటిష్టమైన సంస్కరణల ఎజెండా అమలు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇక ప్రభుత్వ వ్యయాల్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుందని బెనర్జీ చెప్పారు. ఆదాయాలు అంచనాలను అందుకోకపోవడం, కొత్తగా ప్రకటించిన మరిన్ని సంక్షేమ పథకాలు మొదలైన వాటి కారణంగా ద్రవ్య లోటుపరమైన ఒత్తిళ్లు పెరగవచ్చని తెలిపారు. మరోవైపు ఎకానమీలో డిమాండ్‌కు ఊతమివ్వడం, పెట్టుబడుల సెంటిమెంట్‌ను మెరుగుపర్చడమనేవి కొత్త ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యాలని ఈవై ఇండియా చీఫ్ పాలసీ సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. స్వల్పకాలికంగా చూస్తే ఇటు వినియోగం, అటు పెట్టుబడుల డిమాండ్ .. రెండింటికీ ఊతమిచ్చే చర్యలు అవసరమని చెప్పారు. రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం, ప్రభుత్వ వ్యయాలకు అవసరమైన నిధులను ముందస్తుగా సమీకరించుకోవడం, పూర్తి ఏడాది బడ్జెట్ తేదీలను ముందుకు జరపడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంటుందని శ్రీవాస్తవ తెలిపారు. -
19న యూపీ సస్పెన్స్ కు తెర
లక్నో: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19న నూతన ప్రభుత్వం కొలువుతీరనుంది. లక్నోలోని స్మృతివనంలో జరిగే కార్యక్రమంలో కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పటివరకు ఖరారు కాలేదు. ఇటీవల ముగిసిన యూపీ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెల్చుకుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశముంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, టెలికం మంత్రి మనోజ్ సిన్హా, బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు ముఖ్యమంత్రి పదవికి బలంగా విన్పిస్తున్నాయి. వీరిలో ఎవరు సీఎం అవుతారనేది ఆదివారం తేలిపోతుంది. కాగా, యూపీ సీఎం రేసులో తాను లేనని, ఇటువంటి రేసుల గురించి తనకు తెలియదని మనోజ్ సిన్హా వ్యాఖ్యానించారు.


