breaking news
nda presidential candidate
-
ఏపీలో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పర్యటన
-
ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని వైఎస్సార్సీపీ పేర్కొంది. గత మూడేళ్లుగా దేశంలో ఎక్కడా లేని రీతిలో సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న వైఎస్సార్సీపీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నందున ఆ రోజు రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి పాల్గొననున్నారు. -
దళితుడైతే దాడులు మర్చిపోతారా?
♦ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్.. ♦ జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు టికెట్లు: కిశోర్ చంద్రదేవ్ ♦ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల ముఖ్యులతో టీపీసీసీ శిక్షణా శిబిరం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేతను పోటీకి పెడితే వారిపై జరుగుతున్న దాడులను మరచిపోతారా అని టీపీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం లోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల ముఖ్యనేత లతో టీపీసీసీ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణా శిబిరం హైదరాబాద్‌లో బుధవారం జరిగిం ది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గత ఎన్నికల్లో కొంత బలహీనపడిందని ఉత్తమ్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల్లో ఓడి పోవడంపై సమీక్షించుకుని, తిరిగి బలోపేతం కావడానికి పనిచేయాలని సూచించారు. పంజాబ్‌లో అమలు చేసిన విధానం సత్ఫలి తాలిచ్చిందని, అదే మోడల్‌ను రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్లు తెలిపారు. దళితులను బీజేపీ, టీఆర్ఎస్ మోసం చేస్తున్నాయని విమ ర్శించారు. సీఎం కేసీఆర్ ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఎస్టీలకు మొదటి సంతకంతోనే రిజర్వేషన్లు ఇస్తామని ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛను 1,500 కు పెంచుతామని, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లిస్తామని, అదనంగా మరో గది ఇస్తామని చెప్పారు. సమర్థులైన ఎస్సీ, ఎస్టీ లకు కూడా జనరల్ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి అవకాశాలు న్నాయని ఏఐసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్, కేంద్ర మాజీమంత్రి కిశోర్ చంద్రదేవ్ చెప్పా రు. ప్రాంతీయ పార్టీలు.. ప్రాంతీయతత్వాని కి, సంకుచిత ప్రయోజనాలకే పరిమితమ వుతాయని విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రం లో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. యూపీఏ పథకాలకు పేర్లు మారుస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం ఒట్టి ప్రచారం చేసుకుం టోందని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులన్నీ మోదీ కట్టించారా.. అని ప్రశ్నించారు. బ్రహ్మపుత్ర నదిపై బ్రిడ్జికి రిబ్బ న్ కత్తిరించి, తామే కట్టి నట్లు మోదీ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. రిజర్వుడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనపడు తోందని ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో 31 స్థానాల్లో పోటీచేస్తే 6 స్థానాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని, వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారన్నారు. బూత్ స్థాయి నుంచి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులకు పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలను టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వివరించారు. -
రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటనపై అసహనం
- రామ్‌నాథ్‌కు మద్దతుపై ఇప్పుడే చెప్పలేం: కాంగ్రెస్ నేత ఆజాద్ న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇచ్చేది లేనిది ఇప్పుడే చెప్పబోమని ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రామ్‌నాథ్ అభ్యర్థిత్వంపై తక్షణమే స్పందించబోమని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏ తన అభ్యర్థి పేరును ప్రకటించిన తీరుపై ఒకింత అసహనం వెళ్లగక్కారు. ‘రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించడానికి ముందు మమ్మల్ని(విపక్షాన్ని) సంప్రదిస్తామని బీజేపీ చెప్పింది. సోనియా గాంధీతో బీజేపీ త్రిసభ్య కమిటీ భేటీ జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ చెప్పినదానికి విరుద్ధంగా.. ఏకపక్షంగా పేరును వెల్లడించారు’ అని గులాం నబీ ఆజాద్ చెప్పారు. రామ్‌నాథ్ కోవింద్‌కు పోటీగా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి నిలపాలా లేదా అనే దానిపై రెండు రోజుల్లో జరగనున్న సమావేశంలో విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రస్తుత బిహార్ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత అయిన రామ్‌నాథ్ కోవింద్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవింద్ స్వస్థలం యూపీలోని కాన్పూర్. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు