breaking news
Navkar Corporation
-
నవ్కార్ ఐపీఓకు 3 రెట్లు సబ్ స్క్రిప్షన్
న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ కంపెనీ నవ్కార్ కార్పొరేషన్ ఐపీఓ బుధవారం 2.8 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలని నవ్కార్ కంపెనీ యోచిస్తోంది. స్టాక్ మార్కెట్ క్షీణపథంలో ఉన్నా, ఈ కంపెనీ ఐపీఓకు మంచి స్పందన లభించింది. రూ.147-155 ప్రైస్బాండ్తో సోమవారం ప్రారంభమైన ఈ ఐపీఓ బుధవారం ముగిసింది. కాగా ఐపీఓకు వచ్చిన రెండో రోజైన బుధవారం నాడు శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఐపీఓ 46 శాతం, పెన్నార్ ఇంజినీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ ఐపీఓ 7 శాతం చొప్పున సబ్స్క్రైబ్ అయ్యాయి. ఈ రెండు కంపెనీల ఐపీఓలు నేడు(గురువారం) ముగియనున్నాయి. శ్రీ పుష్కర్ కెమికల్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.70 కోట్లు, పెన్నార్ ఇంజినీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ రూ.156 కోట్ల చొప్పన సమీకరించాలని యోచిస్తున్నాయి. శ్రీ పుష్కర్ ప్రైస్బాండ్ రూ.61-65, పెన్నార్ ప్రైస్బాండ్ రూ.170-178 రేంజ్లో ఉన్నాయి. -
నవకార్ ప్రైస్బాండ్ రూ.147-155
ఈ నెల 24 నుంచి 26 మధ్య ఐపీఓ న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ సంస్థ నవ్కార్ కార్పొరేషన్ తన ఐపీఓకు ప్రైస్బాండ్ను నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ప్రారంభమై 26న ముగిసే ఈ ఐపీఓకు రూ.147-155 ధరల శ్రేణిని ప్రైస్బాండ్గా నిర్ణయించామని సోమవారం తెలిపింది. మహారాష్ట్రకు చెందిన ఈ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా తాజాగా షేర్లు జారీ చేసి రూ.510 కోట్లు, ప్రస్తుతమున్న షేర్లను రూ.90 కోట్లకు విక్రయించడం ద్వారా మొత్తం రూ.600 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. కనీసం 95 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 95 గుణిజాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండిగో, కేఫ్ కాఫీ డే, మ్యాట్రిక్స్ వంటి సంస్థలు త్వరలో ఐపీఓకు రానున్నాయి.