breaking news
natti
-
నట్టితో జతకడుతున్న శిల్పా మంజునాథ్
చెన్నై: నటుడు నట్టి, శిల్పా మంజునాథ్ కాంబినేషన్లో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా హారూన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.వేలన్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎం.మునివేలన్ నిర్మిస్తున్నారు. బ్లాక్íÙప్ నందిని, భారత నాయుడు, ప్రీతి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కార్తీక్‌రాజా సంగీతం, క్రిస్టఫర్ ఛాయాగ్రహణ అందిస్తున్నారు. -
హాలీవుడ్ తరహాలో ‘బోంగు’
చెన్నై: పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పేరు తెచ్చుకున్న నట్టీ(నటరాజన్) కథానాయకుడిగానూ రాణిస్తున్నారు. నట్టి నటించిన చతురంగవేటై సంచలన విజయం సాధించింది. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘బోంగు’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రిషీసింగ్ నాయకిగా నటించారు. ఇందులో మనీషా శ్రీ, అతుల్ కులకర్ణి, పావా లక్ష్మణన్, బిశ్వా, అర్జున్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ కళాదర్శకుడు సాబు సిరిల్ శిష్యుడు తాజ్ దర్శకుడిగా మోగాఫోన్ పట్టిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 2వ తేదీన విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మూవీ హీరో నట్టి మాట్లాడుతూ.. బోంగు చిత్రం చాలా బాగా వచ్చిందన్నారు. ఇది ఖరీదైన కార్లు చోరీ చేయడం ఇతి వృత్తంతో తెరకెక్కిన చిత్రం అని చెప్పారు. చిత్రం చాలా ఆసక్తిగా, చాలా స్పీడ్‌గా సాగుతుందని తెలిపారు. ముఖ్యంగా కార్ల దొంగతనం నేపథ్య చిత్రం కావడంతో యువతను బాగా అలరిస్తుందన్నారు. చిత్ర కథ, కథనాలు హాలీవుడ్ చిత్రాల తరహాలో ఉంటాయన్నారు. అంతే కాకుండా తనకు ఈ చిత్రం మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకాన్ని నట్టి వ్యక్తం చేశారు.