breaking news
the National Voters Day
-
ఒకేసారి ఎన్నికలకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహణకు రాజ్యాంగ సవరణతో పాటు అదనపు వనరులు అవసరమని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ, పార్లమెంటరీ సంఘానికి వెల్లడించామని చెప్పారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయంతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. 18 ఏళ్లు నిండిన మొదటిసారి ఓటర్లు, 15–17 ఏళ్ల వయసు వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించడమే సదస్సు ఉద్దేశమని చెప్పారు. -
ఓటు వజ్రాయుధం
నెల్లూరు(అర్బన్): ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవడం ప్రధానమైన విషయమని కలెక్టర్ జానకి అన్నారు. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 30 లక్షలకు మందిపైగా జనభా ఉండగా, వీరిలో 75 శాతంపైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1022 మంది మహిళా ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటరు నమోదు కార్యక్రమం జిల్లాలో విజయవంతమైందని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకోకడమే కాకుండా ఓటు వేయడం, మంచి వ్యక్తిని ఎన్నుకోవడం ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనవన్నారు. అమెరికాలో స్వాతంత్య్రం వచ్చిన 200 సంవత్సరాలకు ప్రజలకు ఓటు హక్కు కల్పించారని తెలిపారు. మన దేశంలో మాత్రం స్వాతంత్య్రం వచ్చిన వెంటనే అందరికీ చాలా సులువుగా ఓటు హక్కు కల్పించారన్నారు. జేసీ ఇంతియాజ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌లో చాలా మార్పులు వస్తున్నాయని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావడం ఎంతో సులవన్నారు. ఈ ఐదేళ్లు ఓటరుగా నమోదు, సవరణలు చేసుకునే అవకాశాలను ఎన్నికల కమిషన్ కల్పిస్తోందన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ దేశ పౌరులుగా చెప్పుకోవడానికి ప్రథమ గుర్తింపు కార్డు ఓటరు కార్డన్నారు. చాలా దేశాల్లో ఓటరు గుర్తింపు కార్డు ఇవ్వడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుందని, మన దేశంలో సులువుగా ఇస్తారు కాబట్టి దీని విలువ చాలా మందికి తెలియడం లేదన్నారు. అర్బన్ ఓటర్ల ఓటింగ్ తగ్గుతోందని, ఓటు వేసి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు. ఏజేసీ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ కనిపించడంలేదని, నూరు శాతం ఓటింగ్ నమోదు అయితే ఎవరో మంచి నేత తెలుస్తుందన్నారు. 18 ఏళ్లు నిండిన వాళ్లు బీఎల్ఓ (బూత్ లెవల్ అధికారి) వద్ద ఓటరుగా నమోదు కావాలని, అలాగే సవరణలు వాళ్ల దృష్టికి తీసుకెళ్లొచ్చని చెప్పారు. డీఆర్ఓ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగస్తులు ఒక చోట నుంచి వేరే చోటుకు వెళ్లిన తర్వాత ఓటు హక్కు కూడా మారుతుందిలే అనుకుంటున్నారని, దరఖాస్తు చేసుకుంటేనే మారుతుందని తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్. బ్రహ్మ సందేశాన్ని స్క్రీన్ మీద ప్రదర్శించి ప్రేక్షకులకు చూపించారు. వెటరన్ ఓటర్లను శాలువాతో సన్మానించారు. నూతనంగా ఓటు హక్కు పొందిన వాళ్లకు ఓటరు గుర్తింపు కార్డులు అందజేశారు.అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తొలుత కలెక్టర్ అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. నెల్లూరు ఆర్డీఓ సుబ్రమణేశ్వరరెడ్డి, నెల్లూరు డిప్యూటీ ఈఓ షాం అహ్మద్ పాల్గొన్నారు. -
ఓటు.. ప్రగతికి రూటు..
జిల్లా ఓటర్లు 33,41,069 మహిళలు 16,81,361 పురుషులు 16,59,455 ఎన్నికల అనంతరం పెరిగిన ఓటర్ల సంఖ్య 1,64,983 మచిలీపట్నం : ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు ఓటు. నేతల తలరాతలు మార్చే శక్తి. అందుకే ఓటును వజ్రాయుధంతో పోలుస్తారు. ఓటు నమోదు కార్యక్రమాన్ని ఓ ప్రహసనంగా నిర్వహిస్తారు. 2014 జనవరి ఒకటో తేదీ నాటికి మన జిల్లాలో 31,76,086 మంది ఓటర్లు ఉండగా, 2015 జనవరి 17వ తేదీ నాటికి ఆ సంఖ్య 33,41,069కు చేరింది. ఇటీవల జరిగిన ఓటర్ల మార్పులు, చేర్పుల్లో 16 నియోజకవర్గాల్లో 1,64,983 మంది నూతనంగా ఓటుహక్కు పొందారు. ఓటరు దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికారులు ప్రజలకు ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. ఓటుహక్కుపై డివిజన్ కేంద్రాల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎక్కువసార్లు ఓటుహక్కు వినియోగించుకున్న సీనియర్ సిటిజన్లను సత్కరించనున్నారు. నూతనంగా ఓటుహక్కు పొందిన వారికి గుర్తింపుకార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు.