breaking news
Natinal
-
జాతీయస్థాయి జూడో పోటీల అబ్జర్వర్‌గా ప్రకాష్
వరంగల్ స్పోర్ట్స్ : జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లో బుధవారం నుంచి ఈనెల 11 వరకు కేరళలోని కొచ్చి రాజీవ్‌గాంధీ ఇండోర్‌స్టేడియం లో జరుగనున్న 17వ ఏషియన్ జూనియర్ జూడో చాంపియన్ పోటీలకు అబ్జర్వర్‌గా జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ వెళ్లనున్నా రు. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముఖేష్‌కుమార్, మన్మోహన్ జైస్వాల్ ఆహ్వానాన్ని పంపిం చినట్లు బండా ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏషియన్ దేశాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొనే పోటీలకు అబ్జర్వర్ గా తెలంగాణ నుంచి తన కు ఆహ్వానం అందడం సం తోషంగా ఉందన్నారు. -
జాతీయ స్థాయిలో తెలుగు వికిపీడియా ఘన విజయం
మోత్కూరు: పంజాబ్ ప్రాంతం గురించి వ్యాసాలు సృష్టిచడంపై జరిగిన దేశ వ్యాప్త పోటీల్లో తెలుగు వికిపీడియా ఘన విజయం సాధించింది. ఆగస్టు 5 నుంచి 7 వరకు చంఢీగడ్‌లో జరిగిన మూడు రోజుల వికీకాన్ఫరెన్స్ ఇండియా ముగింపు ఉత్సవాల్లో వికిమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగాం ఆఫీసర్ అసఫ్బార్టోవ్ చేతుల మీదుగా తెలుగు వికిపీడీయన్లు ట్రోఫీని అందుకున్నట్లు మోత్కూరుకు చెందిన నాటక రంగ పరిశోధక విద్యార్థి ప్రముఖ తెలుగు వికిపీడియన్ ప్రణయ్రాజ్వంగరి బుధవారం విలేకరులకు తెలిపారు. తెలుగులో దాదాపుగా 450 పైగా వ్యాసాలు సృష్టించి విస్తరించడంతో ఇంగ్లిష్ మలయాలంతోపాటుగా సంయుక్త బహుమతిని పొందినట్లు చెప్పారు. తెలుగు వీకిపీడియా పోటీల్లో తనతోపాటు పవన్, సంతోష్ కలిసి సమన్వయకర్తలుగా వ్యవహరించగా విశ్వనాథ్ నిర్వహణలో సహకరించారని చెప్పారు. పంజాబ్ అంశంపై వ్యాసాలు రాసి తెలుగు వికిపీడియాకు ఘన విజయం చేకూర్చిన వారిలో వెంకటరమణ, మీనాగాయత్రి, రవిచంద్ర, పవన్‌సంతోష్, మురళిమోహన్, సుజాత, సుల్తాన్ఖాదిర్, విశ్వనాథ్, భాస్కరనాయుడు, మణికంఠ, రహ్మనొద్దీన్, రాజశేకర్లున్నారని వివరించారు. వీరు పంజాబ్ బాషా, సిక్కు మతచరిత్ర, పంజాబీ ఆహారం, పంజాబీ దుస్తువులు, పంజాబీ మాండలికాలు మొదలైన అంశాలపై చక్కని వ్యాసాలను మూలాలు, బొమ్మలతో సృష్టించారని పేర్కొన్నారు. తెలుగు వీకిపీడియాలో జరుగుతున్న అభివృద్ధి గురించి కాన్ఫరెన్స్‌లో ప్రజెంట్ చేశామని చెప్పారు.