breaking news
nandigamma ZPTC pramila rani
-
ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్
-
ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్
విజయవాడ : గుండెకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందిగామ జెడ్పీటీసీ ప్రమీలారాణిని వైఎస్స్సార్ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్, ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రమీలారాణి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆమె రమేష్ ఆస్పత్రిలో చేరారు. ప్రమీలారాణిని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ చేబ్రోలు మండలం నుద్దపల్లికి బయలుదేరారు. అధికార నేతల అక్రమ క్వారీలను వ్యతిరేకిస్తూ మూడు రోజులుగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతిచ్చేందుకు ఆయన నుద్దపల్లికి వెళ్లారు. రైతుల దీక్షకు మద్దతు తెలుపుతూ వైఎస్ జగన్ కూడా ఈ దీక్షలో పాల్గొననున్నారు.