హైఓల్టేజీతో ఇళ్లకు షాక్
శింగనమల: నాగులగుడ్డం తండాలోని పలు ఇళ్లకు బుధవారం సాయంత్రం విద్యుత్ సరఫరా అయింది. హైఓల్టేజీ కారణంగా ఇళ్ల గోడలకు విద్యుత్ సరఫరా కావడంతో ఐదుగురు గాయపడ్డారు. వారిలో వెంకటేసు నాయక్, దేవమ్మ, అనిత, నీలాబాయి, సాలమ్మ బాయి ఉన్నారు. వెంటనే వారిని 108లో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.