రాజమండ్రిలో రోశయ్య
రాజమండ్రి కార్పొరేషన్, న్యూస్‌లైన్ :మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య మంగళవారం రాజమండ్రి వచ్చారు. మండపేటలో ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన స్థానిక రివర్ బే హోటల్లో సాయంత్రం వరకు బస చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు నగరానికి చేరుకున్న రోశయ్య ఏవీ అప్పారావు రోడ్డులోని జూపూడి శ్రీనివాస్ ఇంటిలో మధ్యాహ్న విందు చేశారు. అనంతరం అక్కడ నుంచి రివర్ బే హోటల్ చేరుకుని బస చేశారు. సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరి మండపేట వెళ్లారు. అక్కడ ఏపీ ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోళ్లకూరి నాగబాబు ఇంట జరిగే వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం ఆయన వెంట ఉన్నారు. వైశ్య నేతలు రోశయ్యను కలిశారు.