breaking news
Mutharam
-
పోటీ పడితే పతకమే!.. అమ్మ కష్టంతో ‘పసిడి పంట’
ముత్తారం(మంథని): ఆమె గ్రామీణ విద్యార్థిని.. ఆర్థిక స మస్యలున్నా కరాటే పోటీల్లో పంచ్ కొడితే పతకం సాధించాలనే తపనతో ప్రతిభకు ప దును పెడుతోంది. ఇటీవల జ రిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్ర తిభ చూపి మే నెలలో మలేషియాలో దేశంలో జరిగే ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ఎంపికైంది మెట్టు హాసిని.పోటీ పడితే పతకమే.. మంథనికి చెందిన మెట్టు దేవి – నర్సింగం దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కుతూరు మానసకు వివాహం అయ్యింది. చిన్నకుతూరు హాసిని మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మంథని బాలికల హై స్కూల్లో చదివింది. ముత్తారం మండలం ధర్యపూర్ మోడల్ స్కూల్లో ఇంటటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రా సింది. నాలుగో తరగతిలోనే సీనియర్ల ను చూసి కరాటే నే ర్చుకోవడమే కాదు.. అందులో రాణించాలని కంకణం కట్టుకుంది. ఇలా ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతూనే కరాటేలో శిక్షణ తీసుకుంది.పసిడి పతకాల పంటఅదేసమయంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించింది. పోటీపడితే వెండి పతకాలతోపాటు ఇప్పటివరకు 15 బంగారు పతకాలు సాధించింది. 2024లో హరియాణాలోని పంచకుల, మధ్యప్రదేశ్‌లోని గాలియానాలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్‌లో గోల్డ్‌మెడల్ సాధించి ఔరా అనిపించింది.గతేడాది 2024 నవంబరులో కరీంనగర్లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్‌లో ఫస్ట్డాన్గా గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈఏడాది మే 7 నుంచి 12వతేదీ వరకు మలేషియాలో జరిగే అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభ చూపే అవకాశం దక్కించుకుంది.అమ్మ ప్రోత్సాహం.. మాస్టర్ కృషి మా నాన్న మా కుటుంబానికి దూరంగా ఉంటున్నా.. మా అమ్మ కూలీ పనిచేస్తూ అక్క పెళ్లి చేసి, నన్ను చదివిస్తోంది. ఆడపిల్లకు కరాటే పోటీలు అవసరమా అని బంధువులు, ఇరుగుపొరుగువారు సూటిపోటీ మాటలతో ప్రశ్నించేవారు. ఇది మనోవేదనకు దారితీసినా.. కరాటే మాస్టర్ సమ్మయ్య నచ్చజెప్పి మళ్లీ శిక్షణ ఇచ్చారు. ఆడవాళ్లు అంటే కుటుంబానికే పరిమితం కాదనే పట్టుదలతో కరాటేలో రాణిస్తున్నా. మలేషియాలో జరిగే పోటీల్లో మెడల్ సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నా. నా ప్రతిభ నాలాంటి ఆడపిల్లల కుటుంబాలకు ఆదర్శంగా నిలవాలి. -
ములుగు జిల్లా: ముత్తారం వాగులో చిక్కుకున్న ట్రాక్టర్
-
రామాలయం వాచ్‌మన్‌కు రూ.5 లక్షలు
- మనవరాలి చికిత్సకు సాయమందించిన సీఎం సాక్షి, హైదరాబాద్: శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో పని చేసే ఓ తాత్కాలిక ఉద్యోగి మనవరాలి వైద్యానికి అయ్యే ఖర్చులకోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని ఫిబ్రవరి 16న సీఎం సందర్శించారు. ఆ సమయంలో అక్కడ వాచ్‌మన్‌గా పని చేస్తున్న షేక్ మస్తాన్ సీఎంకు తన గోడు వినిపించాడు. ఆ సందర్భంలో మస్తాన్ తన మనవరాలు షేక్ సహారీ బేగం దుస్థితి వివరించాడు. ఆమె మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతోందని, తండ్రి చనిపోవటంతో తన వద్దే ఉంటోందని, ఆమెకు వైద్యం చేయించే స్తోమత తనకు లేదని మస్తాన్ సీఎంకు చెప్పాడు. దీంతో చలించిన సీఎం ఆమె వైద్యానికి అయ్యే ఖర్చులపై సీఎంవో అధికారుల ద్వారా ఆరా తీయించారు. వైద్య ఖర్చులు రూ.5 లక్షలు అవుతాయని తేలడంతో ఆ మొత్తాన్ని విడుదల చేశారు. సంబంధిత చెక్కును సీఎంవో అధికారులు సోమవారం మస్తాన్‌కు అందించారు.