breaking news
the municipal election
-
గూడూరులో వైఎస్సార్సీపీ జయభేరి
గూడూరు, న్యూస్‌లైన్ : గూడూరు నగర పంచాయతీకి మొదటిసారి నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగించింది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కంచుకోటగా ఉన ్న గూడూరు పట్టణం వైఎస్సార్సీపీ పరమైంది. మొత్తం 20 వార్డుల్లో 11 స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. టీడీపీ 6, కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలకు ఓటర్లు గట్టిగా గుణపాఠం చెప్పారు. వైఎస్సార్సీపీ కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి ఎం.మణిగాంధీ, నేతలు ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎంఎల్ఏ కొత్తకోట ప్రకాష్‌రెడ్డి స్థానిక నేతలతో కలిసి మెలసి పనిచేయడం వల్లే అధిక స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. పట్టణంలో వైఎస్సార్సీపీ గెలుపొందడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. స్వతంత్ర అభ్యర్థి వైఎస్సార్సీపీలో చేరిక 15వ వార్డు నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి కె.వెంకట్రాముడు వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 12కి చేరింది. స్థానిక నేతలు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎల్.వెంకటేశ్వర్లు, మాజీ ఉప-సర్పంచు ఎస్ఎ జిలానీ ఆధ్వర్యంలో వెంకట్రాముడు కర్నూలులో విష్ణువర్ధన్‌రెడ్డిని కలిసి పూలమాల వేసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థి ఓటమి గూడూరు మునిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన డి.సుందరరాజు ఓటమి పాలయ్యాడు. 20వ వార్డు నుంచి ఆయన ఎన్నికల బరిలోకి దిగగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడివెప్ప 157 ఓట్ల మెజార్టీతో ఓడించాడు. 19వ వార్డు నుంచి పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పీఎన్ అస్లామ్ సమీప టీడీపీ అభ్యర్థి షరీఫ్‌పై 445 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించాడు. అస్లామ్‌కు 557 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 112 మాత్రమే వచ్చాయి. -
ఉక్కిరిబిక్కిరి
ఉయ్యూరు, తిరువూరు, నందిగామ నగర పంచాయతీల్లో ఈసారి 218 మంది కౌన్సిలర్లు ఎన్నిక కానున్నారు. ఒక కార్పొరేషన్, ఎనిమిది మున్సిపాలిటీల్లో ఈసారి మొత్తం 10,41,306 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ రెండున పూర్తవుతుంది. అనంతరమే విజయవాడ నగర మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలకు, 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే ఏడున ఎన్నికలు జరుగుతాయి. ఈసారి జిల్లాలోని 31,76,086 మంది ఓటర్లు సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో ఇటీవల చేరిన కొత్త ఓటర్లు 69 వేల మందికిపైగా ఉన్నారు. తాజాగా ఈ నెల తొమ్మిదో తేదీ ఆదివారం మరో అవకాశం ఇవ్వడంతో జిల్లాలో మరింతమంది కొత్త ఓటర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రెండున్నరేళ్లకు మోక్షం... జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు రెండున్నరేళ్ల తర్వాత మోక్షం దక్కింది. జెడ్పీ చైర్మన్‌గా కుక్కల నాగేశ్వరరావు పాలకవర్గ పదవీకాలం 2011 జూలై 22తో ముగిసింది. అదే ఏడాది జూలై 21న మండల పరిషత్‌ల పదవీకాలం కూడా పూర్తయింది. అప్పటినుంచి పాలకవర్గాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీల రిజర్వేషన్లను ఖరారు చేసిన యంత్రాంగం శనివారం జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్లు ప్రకటించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఏప్రిల్ 6న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. అధికారులకు కష్టకాలమే... వరుస ఎన్నికలు ఒకేసారి రావడంతో యంత్రాంగం సతమయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్నికల విధులు నిర్వర్తించేవారికి ఇది నిజంగా కష్టకాలమే అని చెప్పక తప్పదు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందన్‌రావు కొద్దిరోజులుగా వెన్నునొప్పితో బాధపడుతూనే ఎన్నికల ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు, వీడియో కాన్ఫరెన్స్‌లు, ఫోన్ ఆదేశాలను ఆయన చూసుకుంటూ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు చకచకా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మున్సిపల్, సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ఎస్పీ జె.ప్రభాకరరావు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఏడాదికాలంగా వరుస బందోబస్తులతో జిల్లాలోని పోలీస్ యంత్రాంగం అవస్థలు పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల బందోబస్తు సైతం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న పోలీసులకు వరుస ఎన్నికలు ఊపిరి సలపనిచ్చేలా లేవు. మిగిలిన ఎన్నికల సిబ్బందికి సైతం వరుస ఎన్నికలను తలచుకుంటేనే గుండె జారిపోతోంది. అభ్యర్థులకు అగ్ని పరీక్షే... సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా గెలుపొందాలని గంపెడాశలు పెట్టుకున్న ఆశావహులకు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముందు జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోకపోతే తమ గెలుపు అవకాశాలపై ప్రభావం ఉంటుందని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అనివార్యంగా మున్సిపాలిటీల్లోను, స్థానిక సంస్థల్లోను గెలుపు గుర్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించేలా భరోసా ఇస్తున్నారు. మొత్తానికి ఆశావహులకు వరుస ఎన్నికలు అగ్నిపరీక్ష పెడుతున్నాయి. అరుదైన రికార్డే... ఇటు మున్సి‘పోల్స్’ అటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున నడుమ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమైంది. స్థానిక సంస్థలకు కూడా ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సంకేతాలు ఇవ్వడంతో అరుదైన రికార్డే అవుతుంది. ఐదు ఎన్నికలను నిర్వహిస్తే పట్టణాల్లోని ఓటర్లు మూడు ఓట్లు, గ్రామీణ ఓటర్లు నాలుగు ఓట్లు వేయాల్సి ఉంటుంది.