breaking news
mumbai taj hotel
-
తాజ్‌హోటల్ పేల్చేస్తామంటూ పాక్..
ముంబై : నగరంలోని ప్రఖ్యాత తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం అర్థరాత్రి 12.30 గంటలకు కాల్ చేసిన ఆగంతకుడు బాంబులతో హోటల్‌ను పేల్చివేస్తామని బెదిరించినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. హోటల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా, 2008 నవంబర్ 26న తాజ్హోటల్పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 166 మంది మృతిచెందారు. 300 మందికిపైగా గాయపడ్డారు. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడికి ప్లాన్ చేశారు.మరోవైపు కరాచీలోని స్టాక్ ఎక్స్చేంజ్పై సోమవారం ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది, ఒక పోలీసు అధికారి, ఇద్దరు పౌరులు కూడా మృతి చెందారు. -
ముంబై విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై మరోసారి ఉగ్రవాదులు దాడి తలపెట్టారా? పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ ఇదే మాట చెబుతోంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని తాజ్ హోటల్‌తో పాటు స్వదేశీ, అంతర్జాతీయ విమానాశ్రయాలలో బాంబు పేలుళ్ల గురించి చర్చించుకుంటుండగా తాను విన్నానంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ముంబై మహానగరం మొత్తం అప్రమత్తమైంది. తాజ్ హోటల్‌తో పాటు విమానాశ్రయాలలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను మోహరించి, హై సెక్యూరిటీ ఎలర్ట్ ప్రకటించారు. మూడు ప్రాంతాల్లోనూ భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనే విషయం ఇంతవరకు తెలియలేదు. అతడు మంగళవారం ఉదయం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫోన్ చేశాడు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా మూడు ప్రదేశాలలోను బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను దించారు.