ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో సేవలు నిలిపివేత.. కారణం..
ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ) పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఆగస్టు 16, 2025 నుంచి సరుకు రవాణా కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రన్‌వే 14/32 కోసం కొత్త ట్యాక్సీవేల నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ సామర్థ్యం మెరుగవుతుందని అధికారులు తెలిపారు. తిరిగి తదుపరి నోటీసులు అందేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయిని చెప్పారు.ముంబయిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సరఫరా కావాల్సిన సరుకు రవాణా నవీ ముంబై విమానాశ్రయం నుంచి జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మార్పు ఆచరణాత్మక పరిష్కారాన్ని అందిస్తున్నప్పటికీ ఫార్మాస్యూటికల్స్, పాడైపోయే వస్తువులు వంటి ప్రత్యేక సరుకు రవాణా నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌ల మధ్య దూరం, ముంబయి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సరుకు రవాణా ఆలస్యం కావచ్చని కొందరు భావిస్తున్నారు.సీఎస్ఎంఐఏకు పెరుగుతున్న ప్యాసింజర్, కార్గో రద్దీ కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ల రవాణా ఆలస్యం అవుతుంది. దాంతో మరిన్ని మెరుగైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఎయిర్పోర్ట్ వర్గాలు ఈ చర్యలకు పూనుకున్నాయి. ఎయిర్ ట్రాఫిక్‌కు గ్లోబల్ హబ్‌గా ముంబయి స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ సదుపాయాలు ఎంతో కీలకం కానున్నాయని తెలిపాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్ వెనక్కిమౌలిక సదుపాయాల నవీకరణ ఇలా..రన్ వే 14/32 కోసం కొత్త టాక్సీవేలుటెర్మినల్ 1లో ఏటా రెండు కోట్ల మంది ప్రయాణీకులకు వసతి కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు.మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్ (ఎంఎంటీహెచ్)లో భాగంగా ఎయిర్‌పోర్ట్‌కు డైరెక్ట్ మెట్రో యాక్సెస్, అండర్ గ్రౌండ్ బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.అత్యాధునిక ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.ఈగేట్స్, ఫాస్టాగ్ ఎనేబుల్డ్ పార్కింగ్, ఉచిత ఇంటర్ టెర్మినల్ కోచ్ ట్రాన్స్ఫర్ సర్వీసులను అందించేలా చర్యలు చేపడుతున్నారు.