ప్రజాభీష్టం మేరకు ములుగును జిల్లా చేయాలి
అఖిలపక్షం, జిల్లా సాధన సమితి డిమాండ్
జాతీయ రహదారిపై రాస్తారోకో, ర్యాలీ
ములుగు : ప్రజాభీష్టం మేరకు ములుగును సమ్మక్క–సారలమ్మ జిల్లా చేసే వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామని అఖిలపక్షం అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, జిల్లా సాధన సమితి అ««ధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్ స్పష్టం చేశా రు. ములుగును జిల్లా చేయాలని గురువారం జాతీయ రహదారిపై ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు, హమాలీ కార్మికులతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కిలోమీటర్ల వాహనాలు నిలిచి పోవడంతో ఎస్సై సూర్యనారాయణ ఆందోళన విరమింపజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చింతలపూడి భాస్కర్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి మాట్లాడుతూ ములుగు జిల్లా కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ. యూనుస్, మాస్టర్ కళాశాల కరస్పాండెంట్ కృష్ణశ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షుడు బాణాల రాజు, తెలుగు యువత రాష్ట్ర ఉపా««దl్యక్షుడు వంగ రవియాదవ్, నాయకులు నర్సయ్య, వేణు, నూనె శ్రీనివాస్, రాంబాబు, శత్రజ్ఞుడు, రవికుమార్, స్వామినాథన్, రమేష్, రవి, బాబి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో..
ములుగును జిల్లా చేయాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆ««దl్వర్యంలో తిరుమ ల కళామందిర్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ డివిజన్ కార్యదర్శి కోడి సోమన్న, నాయకులు దేవరకొండ శంకర్, బి. సాంబన్న, లక్ష్మి, జి.సాంబయ్య పాల్గొన్నారు.
నేటి బంద్‌ను విజయవంతం చేయాలి..
ములుగును జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చేపట్టనున్న ములుగు బంద్‌ను విజ యవంతం చేయాలని నల్లెల్ల కుమారస్వామి, ముంజాల బిక్షపతిగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేముల బిక్షపతి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జంపాల రవీందర్, సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ నాయకులు గుగులోతు సమ్మయ్య, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, మార్కెట్ మాజీ చైర్మన్ పిలుపునిచ్చారు.