breaking news
MTS Employees
-
రోడ్డెక్కిన టీచర్లు.. చంద్రబాబు సర్కార్ తీరుపై నిరసన
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు సర్కార్ తీరుకి నిరసనగా టీచర్లు వరుస ఆందోళనలు చేస్తున్నారు. మొన్న ఎస్జీటీలు.. నేడు ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. విశాఖలో మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులు రోడ్కెక్కారు. నేడు జరగాల్సిన కౌన్సిలింగ్‌ను టీచర్లు బహిష్కరించారు. డీఈవో కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉపాధ్యాయులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఏజెన్సీ వేకెన్సీలు మాత్రమే చూపడంపై టీచర్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారుకాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను బదిలీలు చేయొద్దని డిమాండ్ చేస్తూ చేశారు. సింగిల్ టీచర్ పోస్టులను నిరాకరిస్తున్న ఉపాధ్యాయులు.. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఒక ఎంటీఎస్ టీచర్‌ను నియమించాలని డిమాండ్ చేసూ.. డీఈవో కార్యాలయం వద్ద బైఠాయించారు. -
పార్ట్‌టైం, ఎంటీఎస్ ఉద్యోగులెందరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం, మినిమమ్ టైంస్కేల్ (ఎంటీఎస్) ఉద్యోగుల తాజా లెక్కల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాఖల వారీగా వివరాలను సమగ్రంగా అందజేయాల ని వివిధ విభాగాధిపతులను ఆర్థిక శాఖ ఆదేశించింది. గత నెలలో సీఎస్ ఎస్కే జోషి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగుల వివరాల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్‌ఎంఆర్‌లు, డైలీ వేజెస్, కంటిజెంట్ లేదా కన్సాలిడేటెడ్ కింద వివిధ శాఖల్లో చేరిన అనేకమంది ఉద్యోగులు ఏళ్లుగా పార్ట్‌టైం, మినిమమ్ టైం స్కేల్‌పై పనిచేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కొంతమందిని రెగ్యులరైజ్ చేసినా, ఇంకా చాలామంది వివిధ శాఖల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా అలాగే ఉండిపోయిన వారి వివరాలను ఇవ్వాలని విభాగాధిపతులను ఆదేశించింది. 4 ప్రధానాంశాలు.. 1993 నవంబర్ 25వ తేదీ నాటికే పదేళ్ల సర్వీసు పూర్తయినా, రెగ్యులరైజ్ కాని పార్ట్‌టైం ఉద్యోగుల వివరాలను ఇవ్వాలని కోరింది. ఆ స్థానాల్లో క్లియర్ వేకెన్సీలు ఉన్నాయా? పనిచేస్తున్న వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయా? ఇతర కారణాలతో అర్హత పొందలేకపోయారా? పాలనాపరమైన జాప్యం జరిగిందా? అన్న 4 ప్రధాన అంశాలతో ఆ వివరాలను ఇవ్వాలని ఆర్థిక శాఖ రూపొందించిన ప్రొఫార్మాను అన్ని శాఖలకు పంపించింది. దాని ప్రకారం వివరాలను ఇవ్వాలని పేర్కొంది. అలాగే అందులో పనిచేస్తున్న ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, పోస్టు పేరు, నియామక తేదీ, ఎన్‌ఎంఆర్‌గా అపాయింట్ అయ్యారా? డైలీ వేజెస్ కింద అపాయింట్ అయ్యారా? కంటింజెంట్ కింద లేదా కన్సాలిడేటెడ్ కింద నియమితులయ్యారా? ప్రస్తుతం వారికి ఎంత వేతనం వస్తోంది? 1993 నాటికి వారికి ఉన్న సర్వీసు ఎంత? ఆ పోస్టులకు నిర్దేశించిన అర్హతలు, అభ్యర్థికి ఉన్న అర్హతలు, సామాజిక వర్గాల వారీగా వివరాలు తదితర 12 అంశాలపై వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. -
ఆరు నెలలుగా జీతాల్లేవు..!
ఆందోళన చెందుతున్న ఎంటీఎస్ తమ చేతిలో లేదంటున్న అధికారులు పట్టించుకోని ప్రభుత్వం శ్రీకాకుళం న్యూకాలనీ: ఎంటీఎస్(మినిమమ్ టైమ్ స్కేల్) ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతం పడకపోతే నానా హైరానా పడతారని, అలాంటిది ఆరునెలలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్నా పట్టించుకునే అధికారులే కరువయ్యారని కాం ట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో నిరుద్యోగులు వందల సంఖ్యలో కాంట్రాక్టు బేసిక్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి డిసెండర్ నుం చి ఇంతవరకు జీతాలు చెల్లించలేదు. అంతకు ముందు ట్రెజరీల్లో 01 పేరిట ప్రభుత్వం జీతాలను చెల్లిస్తూ వచ్చింది. అయితే, వీరిని తాత్కాలికంగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో 022 పద్దు కింద జీతాలు చెల్లించాల్సి ఉంది. అందుకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. సంబంధిత శాఖల కమీషనర్ల నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం కాలయాపన చేస్తుండడం తో చిరు ఉద్యోగులు కుటుంబపోషణకు సతమతమవుతున్నారు. అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై జిల్లా ఇంటర్మీడియెట్ విద్య వృత్తివిద్యాధికారి పాత్రుని పాపారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఎంటీఎస్ ఉద్యోగులకు జీతాలు రాని మాట వాస్తవమేనని అంగీకరించారు. వారి జీతాలకు సంబంధించిన పద్దు మారిందని, అది తమ చేతిలో లేద న్నారు. కమిషనర్ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉందన్నారు.