పొరపాటుగా మాట్లాడిన చంద్రబాబు
తిరుపతి: భారతదేశాన్ని అవినీతి భారతదేశంగా తయారు చేసేవరకు పని చేస్తానని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పొరపాటుగా మాట్లాడారు. శపథం కూడా చేశారు. తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ గ్రౌడ్లో ఈ రోజు జరిగిన ప్రజా గర్జన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
సభలో ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతూ ''మీరు నన్నుగాని ముందుకు నడిపిస్తే, బుల్లెట్టు మాదిరిగా దూసుకెళతా, అవినీతిపై రామబాణం సంధిస్తా భారత దేశాన్ని అవినీతి భారతదేశంగా తయారు చేసేవరకు ఎన్టీ రామారావు గారి స్పూర్తితో వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతో పని చేస్తాను తమ్ముళ్లు. అది నా ప్రతిజ్ఞ'' అని అన్నారు.