breaking news
Mothers suicide
-
ప్రకాశం జిల్లాలో విషాదం
పెద్దచెర్లోపల్లి: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దచెర్లోపల్లి మండలం అలవలపాడు గ్రామంలో ఇద్దరు పిల్లలు సహా ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన దోతిరెడ్డి కృష్ణవేణి(32) భర్త ఏడేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రుల వద్దే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతోంది. గురువారం రాత్రి తన ఇద్దరు కుమారులు మదన్(12), మనీష్(9)లతో కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
► రైలుకింద పడి బలవన్మరణం గరివిడి(చీపురుపల్లి): ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందోగానీ ఇద్దరు బిడ్డలతో కలిసి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 4గంటలకు గాంధీధామ్ నుంచి పూరీ వైపు వెళ్లే స్పెషల్‌రైలు గరివిడి స్టేషన్లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ ఐదేళ్లు, మూడేళ్లు వయసుగల ఇద్దరు కుమార్తెలతో అకస్మాత్తుగా రైలుకిందకు దూకింది. రెప్పపాటు కాలంలో వారి శరీరాలు నుజ్జునుజ్జు అయ్యాయి. వారు ఎవరో ఎక్కడినుంచి వచ్చారో తెలియదనీ స్టేషన్‌మాస్టర్ తెలిపారు. శ్రీకాకుళం సీఆర్పీఎఫ్, విజయనగరం ఆర్పీఎఫ్కు సమాచారం అందించామనీ, వారు వచ్చి దర్యాప్తు చేసిన తరువాత వారెక్కడినుంచి వచ్చారో తెలుస్తుందని తెలిపారు. -
తనయుడు లేడని తనువు చాలించింది
కన్నబిడ్డ మరణాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలేని లోకంలో తాను ఉండలేననుకుంది. ఏ లోపం లేని మూడేళ్ల బిడ్డను మృత్యువు కబళించడంతో ఆ వేదనను తట్టుకోలేకపోయింది. నిత్యం బాబు ఆలోచనలే వెంబడించడంతో ఉరి సరైన మార్గమని భావించి ఆ మాతృమూర్తి తనువు చాలించింది. చిట్టినగర్ : ఇద్దరు బిడ్డలలో ఒకరికి మానసిక లోపం ఉన్నా ఇద్దరిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లిని చూసి దేవుడికే కన్నుకుట్టినట్లు ఉంది. ఏ లోపం లేని బిడ్డను మృత్యువు కబళించగా, ఆ వేదనను తట్టుకోలేక ఆ కన్నతల్లి ఫ్యానుకు ఉరి వేసుకుని బలాత్మరణానికి పాల్పడింది. ఇప్పటికే బిడ్డ పోయి గంపెడు దుఖంతో ఉన్న ఆ ఇంటిలో నెల రోజుల వ్యవధిలో మరో సారి విషాదం అలుముకుంది. ఈ ఘటన కేఎల్‌రావునగర్ పట్నాయక్ టవర్స్ సమీపంలో మంగళవారం జరిగింది. కేఎల్‌రావునగర్‌కు చెందిన భీమరశెట్టి హరిబాబు,లావణ్య(35)కు ఇద్దరు మగ పిల్లలు. రైల్వే ఉద్యోగం చేసే హరిబాబు పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పెద్ద బాబు జ్యోతిసాయి(15) మానసిక వికలాంగుడు. ఇక రెండో బాబు మోక్షిత్(3) నెల రోజుల కిందట చిన్న పాటి అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. అప్పటి నుంచి లావణ్య మానసికంగా కుంగిపోయింది. ఒడిలో ఆడుకుంటూ మురిపించే బిడ్డ మృత్యువాత పడ్డా ఇంకా తమతోనే ఉన్నాడనే భావనతో ఆ జ్ఞాపకాలలోనే బతుకుతుంది. దీంతో లావణ్య తల్లిదండ్రులు వైజాగ్ నుంచి వచ్చి దైర్యం చెప్పారు. సోమవారమే వారు తిరిగి వారు తమ స్వస్థలానికి బయలుదేరి వెళ్లగా, మంగళవారం ఉదయం భర్త హరిబాబు ఉద్యోగానికి బయలుదేరాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో బిడ్డ జ్ఞాపకాలను మర్చిపోలేక లావణ్య ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 5 గంటల సమయంలో ఇంటికి వచ్చిన హరిబాబు భార్యను ఆస్థితిలో చూసి షాక్‌కు గురయ్యాడు. నెల రోజుల వ్యవధిలో బిడ్డ, భార్య మృతి చెందడంతో హరిబాబు ఇంట విషాదం నెలకొంది. కొత్తపేట పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.