breaking news
Most searches
-
2021లో భారతీయులు తెగ వెతికిన కారు బ్రాండ్ ఇదే..! ప్రపంచంలో టాప్ బ్రాండ్ అదే..!
2021 ముగిసింది. గత ఏడాది ఆటోమొబైల్ కంపెనీలకు కొంచెం ఇష్టం..కొంచెం కష్టంగా వ్యాపారాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చిప్స్ కొరత ఆయా ఆటోమొబైల్ కంపెనీలను కుదేలయ్యేలా చేసింది. చిప్స్ కొరతతో ఉత్పత్తి తగ్గిపోయి అమ్మకాలపై ప్రభావాన్ని చూపింది. భారత్‌లో కూడా ఆయా కంపెనీలపై తీవ్రమైన ప్రభావం పడింది. ఇదిలా ఉంటే వాహనదారులు 2021లో ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో తెగ వెతికిన ఆటోమొబైల్ బ్రాండ్స్ వివరాలను గూగుల్ ప్రకటించింది. భారత్‌లో అదే టాప్..! 2021గాను భారత్‌లో తెగ వెతికిన కార్ బ్రాండ్‌గా దక్షిణకొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ నిలిచింది. హ్యుందాయ్ భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా నిలిచింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం...దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన బ్రాండ్‌గా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. వరల్డ్ టాప్ టయోటా..! ప్రపంచవ్యాప్తంగా అత్యంత శోధించిన బ్రాండ్‌గా టయోటా నిలిచింది. 154 దేశాలలో 47 సెర్చ్ వాల్యూమ్‌లో టయోటా అగ్రస్థానంలో ఉంది. 2021లో 31 శాతం మేర వాహనదారులు వెతకగా...2020లో 34.8 శాతం మంది వెతికారు. 2020తో పోల్చితే సెర్చింగ్ రేట్ తగ్గిన 2021గాను టయోటా టాప్ సెర్చ్డ్ బ్రాండ్‌గా నిలిచింది. ఇక అమెరికాలో 90 ఏళ్ల తరువాత అత్యధిక అమ్ముడైన బ్రాండ్‌గా టయోటాకు దక్కింది. బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బ్రాండ్స్-2021లో గ్లోబల్ గూగుల్ సెర్చ్‌లలో ఆధిపత్యం కొనసాగిస్తూ వరుసగా రెండో ఏడాది తమ మొదటి మూడు స్థానాలను నిలుపుకున్నాయి. 2021లో, హాంకాంగ్, ఇజ్రాయెల్, మకావు, సింగపూర్, చైనాలలో అత్యధికంగా శోధించబడిన కార్ బ్రాండ్ టెస్లా నిలిచింది. చదవండి: ఎలక్ట్రిక్ కారు అవతారంలో పాత టాటా కారు.. రేంజ్ @500 కిమీ! -
నెటిజన్ల మదిలో సన్నీలియోన్
సిటీబ్యూరో: అందాల తార సన్నీలియోన్ హైదరాబాదీ నెటిజన్ల మనసు దోచుకుంది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్... 2015వ సంవత్సరానికి అత్యధిక సెర్చ్‌లు (శోధనలు) దక్కిన స్థలాలు, సినిమాలు, సెలబ్రిటీల తాజా లెక్కలను (సెర్చ్ రిజల్ట్స్)ను గురువారం విడుదల చేసింది. ఇందులో నగరానికి సంబంధించి ఆసక్తికర అంశాలున్నాయి. నగరంలో అత్యధికులు శోధించిన ప్రాంతాల్లో పీవీఆర్ సిని మాస్ (ఐ మ్యాక్స్ థియేటర్) అగ్రస్థానంలో నిలిచింది. సిని మాల్లో ‘బాహుబలి’ నెటిజన్ల మనసు దోచుకున్నట్లు తేలింది. ఇక టాప్ సెలబ్రిటీలలో సన్నీలియోన్ నిలవడం విశేషం. హైదరాబాద్ ఆణిముత్యం సానియా మీర్జా క్రీడాకారుల జాబితాలో ఏడోస్థానంలో నిలిచింది. నగరంలో జాబితా ఇలా ఉంది.... ‘బాహుబలి’కి శోధకులు ఎక్కువే.. ఇక దేశవ్యాప్తంగా రికార్టు సృష్టించిన బాహుబలి చిత్ర విశేషాలను తెలుసుకునేందుకు అత్యధికులు నెట్లో శోధించినట్లు గూగుల్ సంస్థ ఉపాధ్యక్షులు, మేనేజింగ్ డెరైక్టర్ రాజన్ ఆనందన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినివూ పదో స్థానంలో నిలిచిందన్నారు.