breaking news
most searched politicians
-
టాప్ సెర్చ్డ్ సెలబ్రిటీ లిస్ట్ : అల్లు అర్జున్ ఏ ప్లేస్
సాక్షి, న్యూఢిల్లీ: 2020 సంవత్సరానికి సంబంధించి తన ప్లాట్‌ఫాంలో ఎక్కువ మంది వెతికిన సెలబ్రిటీల జాబితాను సెర్చ్ ఇంజన్ యాహూ ప్రకటించింది. దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 లో 'మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీ'గా నిలవగా అతని ప్రేయసి, నటి రియా చక్రవర్తి అత్యధికంగా శోధించిన మహిళా సెలబ్రిటీగా ఉన్నారని యాహూఇండియా మంగళవారం విడుదలచేసిన జాబితాలో వెల్లడించింది. కోవిడ్ వారియర్స్ ను ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' 2020 గా పేర్కొంది. టాలీవుడ్ విషయానికి వస్తే..ఈ ఏడాది జనవరిలో అల వైకుంఠపురం సినిమాతో భారీ విజయాన్నిఅందుకున్న స్టైలిష్ స్టార్ అర్జున్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. 'మోస్ట్ సెర్చ్డ్ మేల్ సెలబ్రిటీ' విభాగంలో సుశాంత్ అగ్రస్థానంలో ఉండగా, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్‌తో పాటు కరోనా కారణంగా మరణించిన గాన గంధర్వుడు ఎస్సీ బాలసుబ్రమణ్యం, దివంగత బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్, క్యాన్సర్తోచనిపోయిన ఇర్ఫాన్ ఖాన్ కూడా ఆ లిస్టులో ఉన్నారు. ఈ ఏడాది 'మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీ' జాబితాలో రియా మొదటి స్థానంలో ఉంది. నటి కంగనా రనౌత్ రెండవ స్థానంలో, దీపికా పదుకొనే, సన్నీ లియోన్, ప్రియాంక చోప్రా ఉన్నారు. 2020 'టాప్ న్యూస్‌మేకర్స్' కేటగిరీ విషయానికి వస్తే, ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలిచారు, సుశాంత్ , రియా సంయుక్తంగా రెండవ స్థానంలో, రాహుల్ గాంధీ మూడవ స్థానంలో ఉన్నారు. 2020 విభాగంలో 'సెలబ్రిటీస్ విత్ బేబీస్ అండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్స్' లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచారు. కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ రెండో స్థానంలో ఉండగా, శిల్పా శెట్టి రాజ్ కుంద్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా కరోనా , లాక్డౌన్ కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచిన నటుడు సోనూ సూద్‌ను 'హీరో ఆఫ్ ది ఇయర్' గా ప్రత్యేకంగా గుర్తించింది టాప్ -10 మేల్ సెలబ్రిటీ లిస్ట్ 1. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ 2. అమితాబ్ బచ్చన్ 3. అక్షయ్ కుమార్ 4. సల్మాన్ ఖాన్ 5. ఇర్ఫాన్ ఖాన్ 6. రిషి కపూర్ 7. ఎస్సీ బాలసుబ్రమణ్యం 8. సోను సూద్ 9. అనురాగ్ కశ్యప్ 10. అల్లు అర్జున్ ఎక్కువగా వెతికిన వారిలో రాజకీయ నేతలు ఎక్కువ స్థానాలనుఅక్రమించగా, ఈ జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండో స్థానంలో నిలిచారు. 2017 తరువాత మోదీ అగ్రస్థానాన్ని కోల్పోవడం ఇదే మొదటి సారి. రియా మూడోస్థానంలో ఉన్నారు. ఇక ఆ తరువాతి స్ధానాల్లో రాహుల్ గాంధీ, అమిత్ షా, ఉద్దవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్ ఉన్నారు. ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రముఖుల జాబితా 1. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2. నరేంద్ర మోదీ 3. రియా చక్రవర్తి 4. రాహుల్ గాంధీ 5. అమిత్ షా 6. ఉద్ధవ్ థాక్రే 7. అరవింద్ కేజ్రీవాల్ 8. మమతా బెనర్జీ 9. అమితాబ్ బచ్చన్ 10. కంగనా రనౌత్ మరోవైపు మహిళల జాబితాలో బాలీవుడ్ భామలదే పై చేయి అయింది. టాలీవుడ్ హీరోయిన్లకు స్థానం దక్కలేదు. పురుషుల జాబితాలో సుశాంత్, మహిళల జాబితాలో రియాకు తొలి స్థానాలు దక్కాయి. 1. రియా చక్రవర్తి 2. కంగనా రనౌత్ 3. దీపికా పదుకోణ్ 4. సన్నీ లియోన్ 5. ప్రియాంక చోప్రా 6. కత్రినా కైఫ్ 7. నేహా కాకర్ 8. కనికా కపూర్ 9. కరీనా కపూర్ 10. సారా అలీ ఖాన్ -
'గూగుల్'లో మోడీ టాప్!
కమలం పార్టీ ప్రధాని అభ్యర్థిగా జాతీయ రాజకీయ యవనికపైకి దూసుకొచ్చిన నరేంద్ర మోడీ తన హవా కొనసాగిస్తున్నారు. కాషాయ పార్టీని కేంద్రంలో మళ్లీ పట్టాలెక్కించగల సత్తా ఉన్న నేతగా నీరాజనాలు అందుకుంటున్న ఈ గుజరాతీ నాయకుడు తదనుగుణంగా పనిచేసుకుపోతున్నారు. ప్రగతిపథంలో గుజరాత్‌ను పరుగులెత్తించిన మోడీపై భారం వేసి వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు బీజేపీ సిద్ధమయింది. 'నమో' మంత్రంతో యూపీఏ హ్యాట్రిక్‌ను అడ్డుకోవాలని వ్యూహాలు పన్నుతోంది. జాతీయ స్థాయిలో మోడీకి ఆదరణ పెరుగుతున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆన్‌లైన్‌లోనూ ఆయన హవా నడుస్తోంది. ఇంటర్నెట్లో వెతికిన రాజకీయ నాయకుల్లో మోడీదే మొదటిస్థానం. గూగుల్‌లో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో సెర్చ్ చేసిన భారత రాజకీయ నాయకుల్లో మోడీ టాప్‌లో నిలిచారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా చెప్పబడుతున్న రాహుల్ గాంధీ రెండో స్థానంలో నిలిచారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తృతీయ స్థానంలో ఉన్నారు. మన్మోహన్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్, జయలలిత, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్, సుష్మా స్వరాజ్, దిగ్విజయ్ సింగ్ మోస్ట్ సెర్చెడ్ పొలిటీషియన్ల జాబితాలో ఉన్నారు. ఇక రాజకీయ పార్టీల విషయానికొస్తే బీజేపీ కోసం నెటిజన్లు ఎక్కువగా శోధించినట్టు ట్రెండ్స్ వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఓటరు గుర్తింపు ఎలా పొందాలనేది అత్యధికులు వెదికిన అంశం. ఎలక్ట్రోరల్ నెంబర్ ఎలా గుర్తించాలి, ఆన్లైన్లో ఓటరు గుర్తింపు పొదడం ఎలా, ఓటు ఎలా వేయాలనే దాని గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఎన్నికల్లో ఎవరికి ఓటేయ్యాలో పట్టణ ఓటర్లలో 42శాతం మంది ఇంకా నిర్ణయించుకోలేదట. 'అర్బన్ ఇండియన్ ఓటర్స్' పేరుతో గూగుల్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. పార్టీని చూసి ఓటేస్తామని 35 శాతం మంది తెలిపారు. స్థానిక అభ్యర్థికే మద్దతిస్తామని 36 మంది పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరనేది చూసి ఓటేస్తామని 11శాతం మంది చెప్పడం విశేషం. పట్టణ యువత ఆన్‌లైన్‌తో గాఢమైన బంధాన్ని కొనసాగిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని భావిస్తున్నట్టు గూగుల్ ఇండియా సర్వేతో తేలింది.