breaking news
Monthly Average Balance
-
Telcos Profits: సగటు యూజర్ నుంచి రూ.157.45
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల బ్యాలన్స్ షీట్లు ఆర్థికంగా బలపడుతున్నాయి. ఒక్కో మొబైల్ యూజర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 8 శాతం పెరిగి జూన్‌తో ముగిసిన త్రైమాసికం చివరికి రూ.157.45కు చేరినట్టు ట్రాయ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరికి ఇది రూ.153.54గా ఉంది. త్రైమాసికం వారీ పనితీరు సూచిక నివేదికను ట్రాయ్ విడుదల చేసింది. టెలికం రంగం సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) 0.13 శాతం పెరిగి రూ.70,555 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే ఏజీఆర్ 7.51 శాతం పెరగడం గమనార్హం. టెలిఫోన్ చందాదారులు మార్చి చివరికి 1,199.28 మిలియన్లుగా ఉంటే, జూన్ చివరికి 1,205.64 మిలియన్లకు చేరింది. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య 35.11 మిలియన్లకు పెరిగింది. క్రితం ఏడాది జూన్ నాటి గణాంకాలతో పోల్చి చూస్తే 16% పెరిగింది. నికరంగా జూన్ క్వార్టర్లో వైర్లెస్ చందాదారులు 54 లక్షల మేర పెరిగారు. దీంతో మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య 1,170.53 మిలియన్లకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి వైర్లెస్ చందాదారులు 1,165.49 మిలియన్లుగా ఉన్నారు. వైర్‌లైన్ టెలీ సాంద్రత 2.50 శాతంగా ఉంటే, వైర్లెస్ టెలీ సాంద్రత 85.95 శాతానికి చేరింది. పల్లెల్లో పెరిగిన టెలికం వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో టెలీ సాంద్రత మార్చి చివరికి ఉన్న 59.19 శాతం నుంచి జూన్ చివరికి 59.65 శాతానికి పెరిగింది. కానీ, ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో టెలీ డెన్సిటీ (టెలికం సదుపాయం ఉన్నవారు) 133.72 శాతం నుంచి 133.46 శాతానికి తగ్గింది. ఇంటర్నెట్ చందాదారులు 1.59 శాతం పెరిగి 969.60మిలియన్లకు చేరారు. -
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్జీల బాదుడు..
-
ఎస్బీఐ చార్జీల బాదుడు..
► ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి... ► కనీస బ్యాలన్స్ లేకుంటే ఇకపై పెనాల్టీలు ► నెలలో మూడు నగదు జమలే ఉచితం ► ఆపై ప్రతీ లావాదేవీపై రూ.50 వడ్డింపు న్యూఢిల్లీ: ఎస్బీఐ ఖాతాదారులు ఇక మీదట కనీస నగదు నిల్వలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. లేదంటే చార్జీల మోత మోగుతుంది. ఏప్రిల్ 1 నుంచి కనీస బ్యాలన్స్ లేని ఖాతాలపై జరిమానా విధించాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఈ పద్ధతి గతంలోనూ ఉండేది. కాకపోతే ఐదేళ్ల నుంచి దీన్ని అమలు చేయడం లేదు. కొత్త ఖాతాదారులను రాబట్టుకునేందుకు వీలుగా నెలవారీ నగదు నిల్వల వైఫల్యంపై చార్జీలు విధించడాన్ని 2012లో నిలిపివేశామని, వాటిని ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రవేశపెడుతున్నామని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. వీటితోపాటు ఏటీఎం సహా పలు ఇతర సేవల చార్జీలను కూడా ఎస్బీఐ సవరించింది. నెలవారీ కనీస నగదు నిల్వ నిర్వహణలో విఫలమైతే సేవింగ్స్ ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 పెనాల్టీ తోపాటు సేవా రుసుము విధింపు ఉంటుంది. కనిష్టంగా రూ.20+సేవా రుసుంను బ్యాంకు నిర్ణయించింది. మూడు దాటితే బాదుడే సేవింగ్స్ ఖాతాదారులు నెలలో మూడు సార్లు మాత్రమే తమ బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపై ప్రతీ డిపాజిట్‌కు గాను రూ.50, దీనికి సేవా రుసుము కలిపి చెల్లించుకోవాలి. రూ.10,000 నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) ఉండే సాధారణ కరెంటు ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించి నగదు డిపాజిట్ చేయాలనుకుంటే ప్రతీ రూ.1,000పై 75పైసల చార్జీ+సేవా రుసుం విధింపు ఉంటుంది. అయితే, ఈ చార్జీ కూడా కనీసం రూ.50కి తక్కువ కాకుండా వసూలు చేస్తారు. మిగిలిన కరెంటు ఖాతాలపై చార్జీలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే, బ్యాంకు శాఖలో నగదు ఉపసంహరణల విషయాన్ని బ్యాంకు ప్రస్తావించలేదు. ఏటీఎం సేవలపై చార్జీలు ఇక నుంచి నెలలో ఎస్బీఐ ఖాతాదారులు సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఐదు సార్లు మాత్రమే ఉచితంగా నగదు ఉపసంహరించుకోగలరు. ఆపై సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి జరిపే ప్రతీ లావాదేవీపై రూ.10 చార్జీ విధిస్తారు. అలాగే, నెలలో ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మూడు సార్లు మాత్రమే నగదు ఉపసంహరణలు ఉచితం. ఆపై ప్రతీ లావాదేవీకి రూ.20 వడ్డన ఉంటుంది. ఒకవేళ ఖాతాలో కనీస నగదు నిల్వ రూ.25వేలు ఉంటే సొంత బ్యాంకు ఏటీఎంలలో జరిపే లావాదేవీలపై చార్జీలు ఉండవు. రూ.లక్ష బ్యాలన్స్ నిర్వహిస్తే ఇతర బ్యాంకుల ఏటీఎంలలోనూ లావాదేవీలు ఉచితం. ఏటీఎం మెషిన్లలో నగదు లేక లావాదేవీ తిరస్కరణకు గురైతే దానిపై కూడా రూ.20సేవా రుసుం విధించడం జరుగుతుంది. ఇతర చార్జీలు ఓ త్రైమాసిక కాలంలో కనీస నగదు నిల్వలు రూ.25 వేలలోపు నిర్వహించే ఖాతాదారులకు వారి డెబిట్ కార్డు లావాదేవీలపై ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు గాను బ్యాంకు రూ.15 చార్జీలు వసూలు చేస్తుంది. పీఐ/యూఎస్ఎస్డీ లావాదేవీల విలువ రూ.1,000 వరకు ఉంటే ఆ సేవలు ఉచితం. బ్యాంకులో లాకర్ తీసుకుని ఉంటే ఏడాదిలో 12 సార్లు మాత్రమే ఉచితంగా సందర్శించేందుకు అనుమతి. ఆపై లాకర్‌ను తెరిచిన ప్రతిసారీ రూ.100+సేవా రుసుం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీటికి అదనంగా వార్షిక నిర్వహణ చార్జీలు ఎలానూ చెల్లించుకోవాలి. కరెంటు ఖాతాలపై చార్జీలు కరెంటు ఖాతాల్లో పవర్ ప్యాక్ రకం ఖాతాలకు ఎంఏబీ రూ.5,00,000. సగటున నెలలో ఈ మొత్తం ఉండకపోతే జరిమానా రూ.2,500+సేవా రుసుం విధిస్తారు. పవర్ గెయిన్ ఖాతాలకు ఎంఏబీ 2,00,000. ఇది విఫలమైతే రూ.1,500+సేవారుసుం జరిమానా విధింపు ఉంటుంది. పవర్ జ్యోతి ఖాతాలకు ఎంఏబీ రూ.50,000. ఈ మొత్తం ఉంచకపోతే రూ.1,000+సేవారుసుం వసూలు చేస్తారు. మిగిలిన అన్ని కరెంటు ఖాతాలకు ఎంఏబీ రూ.10,000 కాగా, నిర్వహణలో విఫలమైతే నెలకు రూ.500+సేవా రుసుం చెల్లించుకోవాలి. సేవింగ్స్ ఖాతాలపై జరిమానాలు బేసిక్ సేవింగ్స్ బ్యాంకు స్మాల్, జన్‌ధన్ యోజన ఖాతాలు మినహా అన్ని సేవింగ్స్ ఖాతాలపై నెలవారీ కనీస నగదు నిల్వ (ఎంఏబీ) నిర్వహణలో విఫలమైతే చార్జీలు ఇలా ఉన్నాయి. జరిమానాలకు అదనంగా సేవా రుసుం కూడా ఉంటుంది. ఖాతా మూసేయాలన్నా చార్జీయే సేవింగ్స్ ఖాతాను ప్రారంభించిన తర్వాత 14 రోజుల నుంచి ఆరు నెలలలోపు మూసేయదలిస్తే రూ.500 చార్జీ, ఆరు నెలల నుంచి ఏడాది లోపు మూసేస్తే రూ.1,000 చార్జీ+సేవారుసుం వసూలు చేయనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. కరెంటు ఖాతాలపై మూసివేత చార్జీ రూ.1,000గా ఉంటుంది. -
ఎస్ బీఐ చార్జీల మోత
న్యూఢిల్లీ: తమ ఖాతాదారులకు షాక్ ఇచ్చేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్ బీఐ) సిద్ధమైంది. పెనాల్టీ, ఇతర చార్జీల పేరుతో ఖాతాదారులపై ఎడాపెడా భారం మోపనుంది. కనీస నిల్వ లేని ఖాతాదారులకు పెనాల్టీ విధించనుంది. ఐదేళ్ల విరామం తర్వాత ఈ నిబంధనలను మళ్లీ తెస్తోంది. ఇక నుంచి నెలలో మూడుసార్లు మాత్రమే ఉచితంగా నగదు డిపాజిట్ చేయగలరు. నాలుగో డిపాజిట్ నుంచి రూ. 50 సేవా పన్ను, సర్వీస్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ అలర్ట్‌లపై మూడు నెలలకు రూ.15 ఛార్జీ వసూలు చేస్తుంది. కొత్తగా అమల్లోకి తెచ్చిన వడ్డింపులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్ బీఐ ప్రకటించింది. కొత్త ఖాతాదారులను ఆకర్షించేందుకు కనీస నిల్వ నిబంధనను 2012లో ఎస్ బీఐ ఎత్తేసింది. మళ్లీ ఇప్పుడు పునరుద్ధరించింది. మెట్రోపాలిటన్ శాఖల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ (రూ.5000) కంటే 75 శాతం కన్నా తక్కువ ఉంటే సేవా పన్నుతో పాటు రూ.100 జరిమానా మినిమమ్ బ్యాలెన్స్ కన్నా అకౌంట్ లో 50 శాతం తక్కువ మొత్తం ఉంటే సర్వీస్ ఛార్జితో కలిపి రూ.50 జరిమానా చెల్లించాలి ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ మూడు సార్లు దాటితే రూ.20 ఛార్జి ఎస్బీఐ ఏటీఎంలలో నగదు ఉపసంహరణ ఐదు సార్లు దాటితో రూ.10 చొప్పును ఛార్జి బ్యాంకు ఖాతాలో రూ.25 వేల కన్నా ఎక్కువ మొత్తం ఉంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా సొంత ఏటీఎంల నుంచి ఎన్ని సార్లైనా నగదు ఉపసంహరించుకోవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసినప్పుడు ఛార్జి పడకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఖాతాలో ఉండాలి. 1000 రూపాయల వరకు యూపీఐ, యూఎస్ఎస్డీ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు