breaking news
money power
-
చెక్ పోస్టుల్లో టీడీపీ రాజ్యం
సాక్షి, చీరాల: సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ అడ్డదారుల్లోనైనా అధికారం తెచ్చుకునేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి కోసం అధికారులను అడ్డంపెట్టుకుని ధన, బల రాజకీయాలకు వినియోగించుకుంటున్నారు. చీరాల్లో ఎలాగైనా గెలుపొందాలని టీడీపీ చేస్తున్న దగాకోరు రాజకీయాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. రూ.100 కోట్లు ఖర్చులు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన అన్నీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న చెక్‌పోస్టు అధికారులు, టీడీపీకి చెందిన వాహనాలను నామమాత్రంగా కూడా తనిఖీ చేయడం లేదు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నియోజకవర్గంలో పందిళ్లపల్లి, ఈపూరుపాలెం, కారంచేడు రోడ్డులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఈ చెక్‌పోస్టుల ద్వారా గుంటూరు జిల్లా నుంచి చీరాలవైపు వస్తున్న అన్ని వాహనాలను విధిగా తనిఖీలు చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సెక్టోరియల్ అధికారి, ఒక వీడియో గ్రాఫర్, ఇద్దరు పోలీసులతో 24 గంటలు తనిఖీ చేయాల్సి ఉంది. కానీ అధికార పార్టీకి చెందిన, ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారులే చీరాలకు ఎన్నికల అధికారులుగా విధులు నిర్వర్తిస్తుండటంతో చీరాల టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలకు, అక్రమాలకు వారే వంత పాడుతున్నారంటే అధికార పార్టీ సేవలో చీరాల ఎన్నికల అధికారులు ఏవిధంగా తలమునకలవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. చెక్‌పోస్టుకు వచ్చే ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, ట్రావెల్స్ వాహనాలు తనిఖీలు చేయాల్సి ఉండగా మొక్కుబడిగా కూడా పనిచేయడం లేదు చెక్‌పోస్టు డ్యూటీలో ఉన్నవారు. అధికార పార్టీకి చెందిన నేతల వాహనాలకు పచ్చజెండా ఊపుతూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల టూవీలర్లు, కార్లును మాత్రం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారంటే చెక్‌పోస్టు అధికారులు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలానే చెక్‌పోస్టుల వద్ద వేటపాలెం పోలీస్ అధికారులు మాత్రం వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులు, వారి అనుచరులను మాత్రం తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, నాయకుల ఇళ్లల్లో కూడా పోలీసులు అక్రమంగా తనిఖీల జరుపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయితే ఈ మధ్య టీడీపీ మహిళా నేత, ఎమ్మెల్సీకి చెందిన వాహనంలో కోట్లాది రూపాయలు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పర్చూరు మీదుగా ఆమె వాహనాల్లోనే చీరాలకు నగదును తరలించారు. కనీసం చెక్‌పోస్టుల వద్ద వారి వాహనాలను ముందస్తు అనుమతుల పేరుతో ఎలాంటి తనిఖీలు చేయలేదు. దీంతో టీడీపీ అభ్యర్థికి కావాల్సిన కోట్లాది రూపాయలు చీరాలకు వారి వాహనాల్లో తరలివచ్చాయి. అందుకు రాష్ట్ర పోలీస్ బాస్‌తో పాటు జిల్లా, స్థానిక పోలీస్ అధికారులు పూర్తిగా టీడీపీ నాయకులకు సహకరించినట్లు సమాచారం. పోలీసులు నిజాయితీగా వ్యవహరిస్తే కనీసం ఒక్క టీడీపీ నాయకుడు, కార్యకర్తల ఇళ్లల్లో సోదాలు చేయని పోలీసులు మాత్రం వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తల ఇళ్లల్లో వరుసగా సోదాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయల నిధులు చీరాలకు వస్తున్న కనీసం పట్టించుకోకపోగా చెక్‌పోస్టుల్లో టీడీపీ నాయకుల వాహనాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఈ అక్రమ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. -
మోదీ వల్లే త్రిపురలో విజయం
అగర్తలా: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీకి, మార్పునకు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. ‘ప్రధాని త్రిపురలో 4 ర్యాలీల్లో ప్రసంగించారు. మా ప్రచారాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు పార్టీ విజయం కోసం కృషిచేశారు. ఈ విజయం క్రెడిట్ ఆయనకే దక్కుతుంది’ అని అన్నారు. త్రిపుర సీఎం అభ్యర్థిపై బీజేపీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పార్టీ పార్లమెంటరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఎం మంచి పోరాటపటిమను ప్రదర్శించిందనీ.. ఏదేమైనా త్రిపుర ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకున్నారని పేర్కొన్నారు. ధనబలంతోనే బీజేపీ విజయం: సీపీఐ సాక్షి, న్యూఢిల్లీ: ధనబలం సహా అన్ని శక్తులను వాడి బీజేపీ రాజకీయాలను ఏమార్చి ఈశాన్య రాష్ట్రాల్లో గెలిచిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. త్రిపురలో ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ)తో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఎన్నో సందేహాలు రేకిత్తిస్తోందని అన్నారు. త్రిపుర ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేక ఓట్లను బీజేపీ కూడగట్టిందని, ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోగలిగిందని పేర్కొన్నారు. -
ఎన్నికల్లో ధన ప్రభావం ఆందోళనకరం: సంపత్
ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్. సంపత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి, రూపు మాపేందుకు వీలైనన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేసి, వీడియో ద్వారా కూడా నిఘా ఉంటుందని సంపత్ తెలిపారు. అభ్యర్థులు డబ్బును ఉపయోగించి, ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.