breaking news
mollywood links
-
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ హాస్యనటుడి భార్య సూసైడ్..!
మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు ఉల్లాస్ పండళం భార్య ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని పతనంతిట్ట జిల్లా పండలంలోని వారి నివాసంలో ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే తన భార్య ఆశా(38) కనిపించడం లేదని ఉల్లాస్ కేరళ పోలీసులకు సమాచారమిచ్చాడు. సమాచారం అందుకున్న కేరళ పోలీసులు అతని నివాసానికి వెళ్లగా.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అయితే ఉల్లాస్ ఇంట్లో ఉన్నప్పుడే ఆశా ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె చనిపోయే ముందు రోజు మొదటి అంతస్తులో తన పిల్లలతో కలిసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఉల్లాస్ పండళం ఎవరు?: ఉల్లాస్ పండళం మాలీవుడ్‌లో ప్రముఖ హాస్యనటుడు. అతని ప్రదర్శనలతో సినిమాలలో ఫేమస్ అయ్యారు. ఉల్లాస్ మమ్ముట్టి నటించిన 'దైవతింటే సొంతం క్లీటస్'తో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా అతను 'ఇతు తాండ పోలీస్', 'కాముకి', 'మన్నార్ మత్తై స్పీకింగ్ 2', 'హాస్యం' లాంటి పలు చిత్రాలలో కూడా నటించాడు. -
నటి కేసు: యువనటుడి ఇంట్లో నిందితుడు!
కొచ్చి: ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, దాడి కేసులో పలు సంచలన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు తాజాగా మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొచ్చి కక్కనాడ్‌లోని ఓ ఫ్లాటులో అతను దాక్కుని ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. కదులుతున్న కారులో నటిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుల్లో అతను కూడా ఒకడని తెలుస్తోంది. అయితే, అతను తలదాచుకున్న ఫ్లాటు మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన ఓ నటుడు-దర్శకుడిదని తేలడం కలకలం రేపుతోంది. నటిపై దాడి కేసులో తాజాగా అరెస్టైన నిందితుడికి నేరుగా సంబంధాలు ఉంటే.. అతడు దాక్కునేందుకు అనుమతించిన సదరు యువనటుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. అయితే, అదుపులోకి తీసుకున్న నిందితుడి గురించి పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మరోవైపు ఈ కేసుకు మాలీవుడ్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానాలు వెలువడటం ప్రకంపనలు రేకెత్తిస్తోంది. నటి ప్రయాణ వివరాలను నిందితులకు చేరవేసింది ఫిలిం యూనిట్ సభ్యుడేనని తాజాగా పోలీసులు కనుగొన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు ప్రధాన సూత్రధారి అయిన పల్సర్ సునికి మలయాళ సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతను సినీ పెద్దలకు అశ్లీల సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాడని పోలీసులు అంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం బాధితురాలైన సినీ నటి చేస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు నలుగురిపైనా పోలీసులు నజర్ పెట్టారని, వారు కూడా పల్సర్ సుని గ్యాంగ్‌తో కుమ్మక్కై సమాచారం అందించి ఉంటారని చెప్తున్నారు.