breaking news
Mogul
-
బ్రిటిషర్లు, మొఘల్ చక్రవర్తులకే అప్పు.. నాటి సంపన్న భారతీయ వ్యాపారి..
స్వాతంత్య్రానికి పూర్వం నుంచే చరిత్రలో భారతీయులు అనేక విషయాల్లో కేంద్ర బిందువులుగా నిలిచారు. అలాగే వ్యాపారంలోనూ చరుకైన పాత్ర పోషించిన భారతీయులు ఉన్నారు. విర్జీ వోరా మొఘల్ పాలనలో పెద్ద పేరున్న వ్యాపారవేత్త. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఆయనను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫైనాన్షియర్ చరిత్రకారుల ప్రకారం.. విర్జీ వోరా 1617 - 1670 మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి పెద్ద ఫైనాన్షియర్. 1590లో జన్మించిన విర్జీ వోరా 1670లో మృతి చెందారు. హోల్‌సేల్ వ్యాపారి అయిన ఆయన వ్యక్తిగత సంపద అప్పట్లో సుమారు రూ. 80 లక్షలు. అంటే ఇప్పట్లో అది కొన్ని లక్షల కోట్లకు సమానం. ఆ మేరకు ఆయన ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త అని అర్థం చేసుకోవచ్చు. చారిత్రక పత్రికల ప్రకారం.. విర్జీ వోరా మిరియాలు, బంగారం, ఏలకులు, ఇతర సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిర్వహించేవారు. 1629 - 1668 మధ్య కాలంలో బ్రిటీష్ వారితో అనేక విధాలుగా వ్యాపార సంబంధాలు నెరిపిన విర్జీ వోరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టంగా నిర్మించుకున్నారు. అప్పట్లో అన్ని వ్యాపారాల్లో విర్జీ వోరాదే ఏకైక గుత్తాధిపత్యం. ఉత్పత్తుల మొత్తం స్టాక్‌ను కొనుగోలు చేసి వాటిని భారీ లాభంతో విక్రయించేవాడు. షాజహాన్‌కు అరబ్ గుర్రాలు విర్జీ వోరా వడ్డీ వ్యాపారి కూడా. సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే బ్రిటిష్‌వారికి ఆయన డబ్బు అప్పుగా ఇచ్చేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశంలోని దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు డబ్బు కోసం విర్జీ వోరాను ఆశ్రయించినట్లు చెబుతారు. విర్జీ వోరా మొఘల్ రాజు షాజహాన్‌కు నాలుగు అరబ్ గుర్రాలను బహుమతిగా ఇచ్చాడని కూడా చరిత్రకారులు పేర్కొంటారు. -
మరో బయోపిక్‌లో అక్షయ్
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రూట్ మార్చాడు. ఒకప్పడు కామెడీ యాక్షన్ సినిమాల మీదే దృష్టి పెట్టిన అక్కి... ఇప్పుడు పీరియాడిక్, బయోపిక్ సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. గత ఏడాది ఇదే జానర్లో ఎయిర్ లిఫ్ట్, రుస్తుం సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న ప్యాడ్ మ్యాన్ సినిమా కూడా బయోపిక్‌గా తెరకెక్కుతున్న సినిమానే. తాజాగా ఇదే జానర్లో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు అక్షయ్ కుమార్. మ్యూజిక్ మొఘల్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ లెజెండ్ గుల్షన్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. మొఘల్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ది గుల్షన్ కుమార్ స్టోరి' అనేది ట్యాగ్ లైన్ కాగా.. 'ది ఎంపరర్ ఆఫ్ మ్యూజిక్' అనేది క్యాప్షన్. ఈ సినిమాను గుల్షన్ కుమార్ భార్య సుదేష్ కుమారి నిర్మిస్తుండగా సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సిలౌట్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.