breaking news
MLAs of the ruling party
-
Prashant Kishor: 40 మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి నో టికెట్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యర్థి పారీ్టల రాజకీయ ఎత్తుగడలను నిశితంగా గమనిస్తున్న అధికార టీఆర్ఎస్ మరోవైపు సొంత పార్టీ నేతల పనితీరుపైనా దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఐ ప్యాక్ నివేదికల నేపథ్యంలో 40 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం దక్కక పోవచ్చని తెలుస్తోంది. శాసనసభ నియోజకవర్గాలవారీగా ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు సెగ్మెంట్ పరిధిలోని ఇతర ముఖ్య నేతల పనితీరు, గుణగణాలపై టీఆర్ఎస్ లోతుగా వివరాలు సేకరిస్తోంది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ‘ఐ ప్యాక్’బృందం ఈ మేరకు నివేదికలు రూపొందిస్తోంది. ఇప్పటికే సుమారు 70 నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకు చేరాయి. మరో 40కి పైగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై నివేదికలకు ఈ నెల 20లోగా తుది రూపు వచ్చే అవకాశముంది. వివిధ కోణాల్లో సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి రూపొందిస్తున్న ఈ నివేదికల ఆధారంగా క్షేత్ర స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహానికి కూడా ఇప్పటినుంచే పదును పెట్టాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. మీడియా సంబంధాలపైనా విశ్లేషణ ప్రధాన మీడియా, వాటి ప్రతినిధులతో పార్టీ పరంగా ఉన్న సంబంధాలు, సమాచారం పంపిణీ, సామాజిక మాధ్యమాల్లో పార్టీకి అనుకూలం, ప్రతికూలంగా జరుగుతున్న ప్రచారం తదితరాలను కూడా ఐ ప్యాక్ బృందాలు అంచనా వేస్తున్నాయి. మీడియాలో వస్తున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఎలాంటి కంటెంట్ (అంశాలు) అవసరమనే కోణంలోనూ మదింపు జరుగుతోంది. మరోవైపు వివిధ సందర్భాల్లో పార్టీ తరఫున మీడియాలో గళం విప్పుతున్న ప్రతినిధుల సమర్ధత, వారికి వివిధ అంశాలపై ఉన్న అవగాహన, వారి భాషా పరిజ్ఞానం తదితరాలను కూడా ఐ ప్యాక్ విశ్లేషిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు ఏ తరహా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి, ఆ పారీ్టకి ఉన్న మీడియా సంబంధాలపై కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇటీవల నివేదికలు అందజేసింది. అన్ని వైపుల నుంచీ ఆరా.. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పూర్తి వివరాలను ఐ ప్యాక్ బృందం సేకరిస్తోంది. వైవాహిక స్థితి, కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారా, ఏయే పదవుల్లో ఉన్నారు? ఎలాంటి పనితీరు కనపరుస్తున్నారు? వంటి కోణాల్లో బృందాలు ఆరా తీస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు, నేతల ఆర్థిక స్థితిగతులు, వారికి ఉన్న వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూస్తున్నదెవరు?, పార్టీ, సామాజిక కార్యక్రమాల్లో ఎంత మేర చురుగ్గా పనిచేస్తున్నారు? తదితర వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రతికూలత ఉండే పక్షంలో ఎవరు సరైన ప్రత్యామ్నాయం అనే కోణంలోనూ సమాచార సేకరణ జరుగుతోంది. పార్టీలో అంతర్గత గ్రూపులు, వీటి వెనుక ఉన్న కీలక నేతలు, పార్టీ యంత్రాంగంపై గ్రూపు రాజకీయాల ప్రభావం తదితర అంశాలను కూడా నివేదికలో పొందుపరుస్తున్నారు. ఇలావుండగా ఇతర పారీ్టల నుంచి టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు లేదా ఇతర పారీ్టల్లో బలమైన నేతల వివరాలు కూడా ఈ నివేదికల్లో ఉన్నట్టు తెలుస్తోంది. విపక్ష ఎమ్మెల్యేల పనితీరు, వారి బలాబలాలను కూడా అంచనా వేస్తున్న ఐ ప్యాక్ బృందాలు ఆ మేరకు నివేదికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. -
పనితీరుకు పాతర
జిల్లాలో దూమారం రేపుతున్న ఉద్యోగుల స్థానచలనం రెవెన్యూలో కొనసాగుతున్న కసరత్తు కీలక మండలాల తహసీల్దార్ పోస్టింగ్‌ల కోసం {పజాప్రతినిధుల పట్టు వాణిజ్య, రవాణా శాఖ బదిలీల్లో ఎన్జీవో రాష్ట్ర నేత జోక్యం కావాల్సిన 10 మందికి కీలక ఏసీటీవో పోస్టింగ్‌లు జిల్లా పరిషత్‌లో 163 మంది ఉద్యోగులకు బదిలీలు మాట వినని అటవీశాఖ అధికారులకు స్థానచలనం చక్రం తిప్పుతున్న అమాత్యులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు విజయవాడ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసే అధికారులను పక్కన పెట్టి, తమకు కావాల్సిన, తమ సామాజికవర్గం వారు, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఏజెంట్లా పనిచేసే అధికారులకు పెద్దపీట వేస్తున్నారు. బాగా ముట్టజెప్పడాన్ని అదనపు అర్హతగా నిర్ణయించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అమాత్యులు బదిలీల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, జిల్లా పరిషత్, వాణిజ్యపన్నులు, రవాణా, నీటి పారుదల శాఖల్లో బదిలీలపై పూర్తి దృష్టి కేంద్రీకరించి జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకు బదిలీలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈనెల 20వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేయాల్సి ఉంది. మూడేళ్లు పనిచేసిన వారిని రిక్వెస్ట్ బదిలీ చేయొచ్చు. జిల్లాలో దీనికి భిన్నంగా బదిలీల పర్వం సాగుతోంది. కావాల్సి ఉద్యోగి అయితే ఒకేచోట ఏడేళ్లకు పైగా పనిచేస్తున్నా పట్టించుకోవడంలేదు. జిల్లాలో కీలకమైన తహసీల్దార్ల బదిలీల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జిల్లాలో 15 మందికిపైగా తహసీల్దార్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. కొందరు అధికాారపార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమకు అనుకూలురైన తహసీల్లార్లకు పోస్టింగ్ ఇప్పించే పైరవీల్లో నిమగ్నమయ్యారు. మచిలీపట్నంలో కలెక్టరేట్లో బదిలీల ప్రహసనం సాగుతూనే ఉంది. రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలు ఎక్కువగా ఉండటంతో ఉన్నతాధికారులు తేల్చులేకపోతున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే.. కైకలూరు నియోజకవర్గంలో మాట వినని అధికారులను మంత్రి కామినేని శ్రీనివాసరావు, అధికార పార్టీ నేతలు పట్టుబట్టి మరీ బదిలీచేయించారు. కైకలూరు, మండవల్లి పరిధిలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. ఇక్కడ చేపల సాగు నిషిద్ధం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు, మంత్రి కామినేని అనుచరులు అక్రమంగా చేపల సాగు చేపట్టారు. దీనిని అడ్డుకున్న అటవీశాఖ రేంజర్ సునీల్‌కుమార్, తెలంగాణ కేడర్‌కు చెందిన వి.వి.ఎల్.సుభద్రాదేవిని కొద్ది నెలలకే బదిలీ చేశారు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఇటీవల జరిగిన బదిలీల్లో మంత్రి, చైర్పర్సన్ తమకు ఇష్టం లేని ఉద్యోగులను అక్కడి నుంచి సాగనంపారు. జూనియర్ అసిస్టెంట్లు ఏడుగురు, సీనియర్ అసిస్టెంట్ ఒకరు, బిల్ కలెక్టర్లు ఐదుగురు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఒకరిని బదిలీ చేయించారు. రాష్ట్ర ఎన్జీవో నేత జోక్యం జిల్లాలోని వాణిజ్య పన్నులు, రవాణా శాఖల ఉద్యోగుల బదిలీల్లో రాష్ట్ర ఎన్జీవో సంఘ కీలక నేత చక్రం తిప్పారు. విజయవాడ పరిధిలో పనిచేస్తున్న 10 మంది ఏసీటీవోలను బదిలీలు చేయించడం వెనుక ఆ నేత పరపతితో పాటు భారీగా నగదు చేతులు మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు కావాల్సిన వారిని కీలక ప్రాంతాల్లో, అధిక ఆదాయం ఉండే చోట ఏసీటీవోలుగా నియమించారు. మూడేళ్ల సర్వీసు పూర్తికానివారిని కూడా బదిలీ చేయించారు. ఇదే క్రమంలో పరపతి ఉన్న అధికారుల జోలికి వెళ్లలేదు. సదరు ఎన్జీవో నేతతో సన్నిహితంగా ఉంటూ ఇటీవల తన నివాసంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ సోదాలు ఎదుర్కొన్న అధికారి, మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఇద్దరు జిల్లా స్థాయి అధికారుల బదిలీల్లో చక్రం తిప్పారు. పరపతి లేకపోవడంతో ఏడాది కాలం పూర్తి కాని గుంటూరు, ఏలూరు అధికారులను బదిలీ చేశారు. సదరు నేత రవాణా శాఖ బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారు. తమ యూనియన్ కార్యకలాపాల్లో ఉండే ఒక ఉద్యోగికి తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ జరిగింది. ఆ ఉద్యోగి బదిలీని నిలిపివేసే ప్రయత్నాల్లో ఎన్జీవో నేత ఉన్నారని సమాచారం. గుంటూరులోనూ అడ్డగోలే.. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రకియ అడ్డగోలుగా సాగుతోంది. జిల్లాలో చక్రం తిప్పే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు అన్నిశాఖల బదిలీల్లో విపరీతంగా జోక్యం చేసుకుంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ శాఖ వ్యవహారాలు, బదిలీలను ఓ సీనియర్ ఎమ్మెల్యే, ఇతర ప్రభుత్వ శాఖల వ్యవహారాలను మరో సీనియర్ ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత బదిలీల్లో వారిద్దరు పూర్తిస్థాయిలో చక్రం తిప్పారు. జిల్లాలో కీలకంగా ఉన్న మంత్రి అన్ని శాఖల బదిలీల్లో కల్పించుకుని కావాల్సినవారికి కావాల్సిన పోస్టింగ్ ఇప్పించారని తెలుస్తోంది. జిల్లా పరిషత్‌లో 152 మంది ఉద్యోగులు బదిలీ అవగా 50 శాతం వరకు నిబంధలకు విరుద్ధంగానే జరిగాయి. జిల్లాలో 20 మంది తహసీల్దార్లకు స్థానచలనం తప్పదన్న ప్రచారం సాగుతోంది.