సోనియా తెలివితక్కువ నిర్ణయం: వీరశివారెడ్డి
కడప(వైఎస్ఆర్ జిల్లా): కమాలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశీవారెడ్డి పార్టీపైన, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం సోనియా తెలివి తక్కువతనంతో తీసుకున్నదేనన్నారు. విభజన నిర్ణయం వెనుకకు తీసుకోకపోతే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందని హెచ్చరించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హీరో అవుతారన్నారు. కాంగ్రెస్ జీరో అయిపోతుందని కూడా హెచ్చరించారు. కాంగ్రెస్లో అందరు తెలివిలేని నాయకులేనని అన్నారు. ఏకపక్ష నిర్ణయం కారణంగా సీమాంధ్రలో కాంగ్రెస్కు ఓటేసే వారే ఉండరని చెప్పారు.
సమైక్యాంధ్ర కోసం వీరశివారెడ్డి శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాని రాజీనామా చేసిన విషయం తెలిసిందే.