MLA reign
-
అన్నాడీఎంకేకు షాక్‌ల మీద షాకులు
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మరో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఇప్పటికే ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంబసముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా.. అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు రాజీనామా సమర్పించారు. ఆయన టీవీకేలో చేరే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికే సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు శిబిరాలుగా విడిపోవడం తెలిసిందే. మొత్తం 47 మందికిగాను పళణి స్వామి వర్గంలో 22 మంది, సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో శాసనసభా పక్షం, విప్ హోదాపై వివాదం కొనసాగుతోంది.ఈ పరిస్థితుల్లో తిరుగుబాటు బృందంలోని మరగతం కుమరవేల్, సత్యభామ, జయకుమార్ అనే ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు రాజీనామా లేఖలను సమర్పించారు. వాటిని ఆయన వెంటనే ఆమోదించడం, టీవీకే ముఖ్య నేత, మంత్రి ఆధవ్ అర్జున సమక్షంలో ఆ పార్టీలో చేరడం చకచకా జరిగిపోయాయి. ఈ నెల 13వ తేదీన అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో పార్టీ విప్‌ను ధిక్కరిస్తూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయడం గమనార్హం. -
ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఝలక్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా
పాట్నా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ మాజీ మంత్రి మురారి ప్రసాద్ గౌతమ్ బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. గౌతమ్ రాజీనామాతో రోహ్తాస్ జిల్లా చెనారి రిజర్వుడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని బీహార్ అసెంబ్లీ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ సందర్భంగా ‘శాసన సభ్యత్వానికి రాజీనామా వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని గౌతమ్ పీటీఐకి స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలో ఉన్నప్పుడు నితీశ్ కుమార్ ప్రభుత్వంలో గౌతమ్ మంత్రిగా పనిచేశారు. జేడీ(యూ) మళ్లీ ఎన్డీఏలోకి వచ్చిన తర్వాత, ఆయన ట్రెజరీ బెంచ్ సభ్యులతో కలిసి కూర్చోవడం ప్రారంభించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆయన అనర్హత కోరుతూ దాఖలైన పిటిషన్ స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్ ముందు పెండింగ్‌లో ఉంది. నవంబర్ 6, 11 తేదీల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుండటం తెలిసిందే. -
మినిస్టర్ చందూలాల్
25 ఏళ్ల తర్వాత మంత్రి పదవి కలిసొచ్చిన సామాజికవర్గం టీఆర్ఎస్లో కొత్త సమీకరణలు నామినేటెడ్ పోస్టులపై అందరి దృష్టి వరంగల్ : ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి అయ్యారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలు ఆయనకే దక్కాయి. మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. చందూలాల్‌కు మంత్రి పదవి రావడం ఇది రెండోసారి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1989లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే శాఖ దక్కింది. మంత్రుల సంఖ్యపై పరిమితి నేపథ్యంలో మరో రెండు శాఖలను కేసీఆర్ చందూలాల్‌కే కేటారుుంచారు. వివాదరహితుడిగా పేరుంది. టీఆర్ఎస్ తరఫున గెలిచిన గిరిజన సామాజికవర్గం ఎమ్మెల్యేలలో ఆయనే సీనియర్. కీలకమైన శాఖలకు మంత్రిగా నియమితుడైన చందూలాల్‌పై జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. తెలంగాణలో గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లా కావడంతో ఈ వర్గం వారు భారీగా ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో ప్రాచీన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖలు చందూలాల్‌కే దక్కడంతో జిల్లాకు ప్రాచీన వైభవం వస్తుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. వరంగల్‌కు ప్రాధాన్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు రాజకీయంగా మంచి ప్రాధాన్యత దక్కింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్యకు రాష్ట్రంలో కీలకమైన ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. భూపాలపల్లి ఎమ్మెల్యే ఎస్.మధుసూదనాచారిని స్పీకర్ పదవి వరించింది. జిల్లాకు చెందిన ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు నామినేటెడ్ పదవులు వచ్చాయి. బి.రామచంద్రుడుకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవి, బి.వి.పాపారావుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవులు దక్కాయి. తాజాగా చందూలాల్‌కు మంత్రి పదవి దక్కింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ కార్యదర్శి పదవి వచ్చింది. వినయ్‌కు ఏ శాఖ బాధ్యతలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లోనూ జిల్లాకు ప్రాధాన్యత దక్కుతుందని టీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. ఈ నెలాఖరులోనే జిల్లాలోని మరో ఇద్దరు, ముగ్గురు నేతలకు నామినేటెడ్ పదవులు దక్కనున్నట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి.


