breaking news
MLA Buggana
-
బాబు తక్షణమే రాజీనామా చేయాలి
పీఏసీ చైర్మన్ బుగ్గన డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘స్విస్ చాలెంజ్’ విధానంపై హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఏపీ అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంకా పదవిలో కొనసాగడం అనైతికమన్నారు. బుగ్గన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నించడాన్ని హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారని గుర్తుచేశారు. కోర్టు తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి, ఆ తరువాత పిటిషన్‌ను ఉపసంహరించుకుని, చట్టానికి సవరణలు చేసిందన్నారు. తాజా నోటిఫికేషన్ జారీ చేస్తామని మున్సిపల్ మం త్రి పి.నారాయణ చెప్పడం దారుణమన్నారు. ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు వెలువడినపుడు వారు తమ పదవులకు రాజీనామా చేసిన సత్సాంప్రదాయం మన రాష్ట్రంలో ఉందన్నారు. గతంలో ప్రైవేట్ బస్సు రూట్ల జాతీయీకరణను హైకోర్టు తప్పుపడితే అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. అలాగే 9 మెడికల్ కళాశాలలకు అనుమతి ఇచ్చినప్పుడు హైకోర్టు తప్పుపడితే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పదవి నుంచి వైదొలిగారని గుర్తుచేశారు. స్విస్ చాలెంజ్‌పై ఎదురుదెబ్బ తిన్న బాబు కూడా ఇదే సంప్రదాయం పాటించి గద్దె దిగాలని రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు చెప్పారు. డబ్బులివ్వడం తప్పు కాదట! ఓటుకు కోట్లు కేసులో ఓటును డబ్బు పెట్టి కొనుగోలు చేయడం తప్పు కాదని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. మరి, ఈ నేరాన్ని ఏ చట్టం కింద నమోదు చేయవచ్చో ఆ న్యాయవాదే సెలవిస్తే బాగుంటుందని బుగ్గన అన్నారు. -
'నిరూపిస్తే ఆ భూమి నీకే రాసిస్తా'
- డిప్యూటీ సీఎం కేఈకి పీఏసీ చైర్మన్ బుగ్గన సవాల్ - హంద్రీనీవా భూసేకరణలో బీనామీ పేర్లతో కేఈ కుటుంబీకులు రూ.కోట్లు స్వాహా డోన్ టౌన్: తన కుటుంబీకుల పేరుతో తొమ్మిది వందల ఎకరాల భూములు ఉన్నట్లు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోపణలు చేయడంపై పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డోన్ ఆర్ఈ రవికుమార్ స్వగృహంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలను కేఈ నిరూపిస్తే 899 ఎకరాల భూమిని ఆయనకే రాయించి ఒక ఎకరం మాత్రమే కేఈకి గుర్తుగా ఉంచుకుంటానని ఎద్దేవా చేశారు. వాస్తవంగా చెర్లోపల్లిలో తన పేరుపై ఎకరా భూమి ఉండగా కేఈలాంటి వ్యక్తులు అబద్దాలు, అభూత కల్పనలతో ప్రచారం చేయడం తగదన్నారు. బినామీ పేర్లతో ప్రజాధనాన్ని బొక్కేయడంలో కేఈ కుటుంబీకులుకు మించిన వారు జిల్లాలో లేరన్నారు. ఓర్వకల్లు సెజ్ ప్రాంతంలో, కంబాలపాడు హంద్రీనీవా భూసేకరణలో ప్రభుత్వ భూములకు బీనామీ పేర్లతో పట్టాలు సృష్టించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దిగమింగారని ఆరోపించారు. కేఈ కుటుంబీకులు అభివృద్ధి పనులకు ఏనాడు సెంటు స్థలం ఇవ్వలేదన్నారు. వంద ఏళ్ల చరిత్ర ఉన్న తన సొంత భూమికి భూసేకరణ చట్టప్రకారం నష్ట పరిహారం కోరానే తప్ప, అభివృద్ధి పనులను ఏనాడు అడ్డుకోలేదన్నారు. చెర్లోపల్లిలోని ఎకరా భూమికి తానే యజమానినని, భూమిపై తనకు సర్వహక్కులు ఉన్నాయని బుగ్గన ప్రకటించారు. కేఈ ఇంటిలో రోడ్డు వెడల్పంటూ అడుగు స్థలం దౌర్జన్యంగా ఆక్రమిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. తనకు నోటీసు ఇవ్వకుండా అధికారమదంతో పోలీసులను అడ్డుపెట్టుకొని స్థలాన్ని ఆక్రమిస్తే కోర్టుకు వెళ్లడం తప్ప తనకు మరో మార్గం కనపడలేదన్నారు. అడిగితే ఉచితంగా ఇచ్చేవాడిని: అభివృద్ధి పనులకు తాను వ్యతిరేకమని కేఈ ప్రచారం చేయడంపై బుగ్గన మండిపడ్డారు. నష్టపరిహారం చెల్లించి చట్టప్రకారం భూమిని తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను తానే స్వయంగా కోరిన విషయాన్ని బుగ్గన గుర్తుచేశారు. సామరస్యంగా తనను అడిగినట్లయితే ఎకరం భూమిని ఉచితంగా ఇచ్చేవాడినని తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పుల్లారెడ్డి, వెంకోబరావ్, రాజవర్దన్, దినేష్‌గౌడ్, మల్లెంపల్లి రామచంద్రుడు,పెద్దిరెడ్డి, కోట్రికే హరికిషన్, రాజశేఖర్‌రెడ్డి, గజేంద్ర, కటిక వేణు తదితరులు పాల్గొన్నారు.