breaking news
minor wife
-
మారిటల్ రేప్ నేరం కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని (మారిటల్ రేప్) నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై భారత పార్లమెంటు సైతం గతంలో విస్తృతంగా చర్చించిందని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం తెలిపింది. మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడానికి అనుమతిస్తున్న నిబంధనల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీం ఈ మేరకు స్పందించింది. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం భార్య వయసు 15 ఏళ్ల లోపుంటే ఆమె ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా శృంగారంలో పాల్గొంటే నేరమవుతుంది. ఒకవేళభార్య వయసు 15 ఏళ్లకు పైబడి 18 ఏళ్ల లోపుంటే అప్పడు ఆమె అంగీకారం లేకుండా శృంగారంలో పాల్గొన్నా నేరం కాద’ని కోర్టు పేర్కొంది. -
పోలీస్ ఠాణాలో ప్రేమికుల ఆత్మహత్య!
రాంచి: జార్ఖండ్ లోని పోలీసుల అదుపులో ప్రేమికుల జంట ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసుల అదుపులో ఉన్న ముస్లిం యువకుడు, హిందూ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించారు, రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఘటన చోటు చేసుకుంది. ఈ జంట ఆత్మహత్యలపై పలు అనుమానాలు నెలకొన్నాయి. గొడ్డాజిల్లాకు చెందిన ముస్లిం వ్యక్తి మహమ్మద్ గఫర్, హిందూ మతానికి చెందిన అమ్మాయి (15) నెలన్నర క్రితం పారిపోయి మతాంతర వివాహం చేసుకున్నారు. దీంతో తమ కూతురుని కిడ్నాప్ చేసి, పెళ్లి చేసుకున్నాడంటూ అమ్మాయి తరపు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అంతకుముందే గఫర్ కు వివాహమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్ లో వుంచారు. ఏం జరిగిందో తెలియదుకానీ తెల్లవారేసరికి ఇద్దరూ శవాలై తేలారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించిన అధికారులు విచారణ చేపట్టారు. అటు గుర్తు తెలియని విషపదార్థం సేవించడం వల్లనే చనిపోయి వుంటారని తమ ప్రాథమిక విచారణలో తేలిందని రాంచీ ఏఎస్పీ కులదీప్ ద్వివేది తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై విచారణకు ఆదేశించామన్నారు. ఈ ఘటనలో ఒక మహిళా ఏఎస్ఐ సహా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశామని అధికారి తెలిపారు.