breaking news
	
		
	
  minor stampede
- 
            
                                     
                                                           
                                   
                తిరుమలలో తోపులాట.. భక్తులకు గాయాలు
 - 
      
                   
                               
                   
            తిరుమల క్యూలైన్లలో తోపులాట.. భక్తులకు గాయాలు

 వారాంతపు సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. మొత్తం కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు రెండు కిలోమీటర్ల మేర నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తులు తోపులాటకు దిగడంతో పలువురు భక్తులకు గాయాలు కూడా అయ్యాయి.
 
 తిరుమల క్యూలైన్ల నిర్వహణపై ఇంతకుముందు నుంచి పలు ఫిర్యాదులు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలవుదినాలు, పరీక్షల ఫలితాలు వచ్చిన సందర్భాలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరుగుతుంది. కానీ దానికి తగిన ఏర్పాట్లను టీటీడీ చేయలేకపోతోందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు కూడా అలాగే క్యూలైన్లు నిండటంతో భక్తులు తోపులాటకు దిగారు. 


