breaking news
Minor gangraped
-
అత్యాచారాల అడ్డాగా...
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అత్యాచారాల అడ్డాగా మారుతోంది. నేర చరిత్రకు తార్కాణంగా నిలుస్తోంది. బులంద్ షహర్ అత్యాచార ఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే ఓ మైనర్ బాలికపై 12 మంది సామూహిక అత్యాచారం జరిపి హత్య చేయడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ నగ్లాసంత్ గ్రామంలో 14 ఏళ్ళ మైనర్ బాలికపై 12 మంది అత్యాచారానికి ఒడిగట్టడమే కాక, ఆమెను హత్య చేయడం ఆందోళన రేపుతోంది. ఆగస్టు 20న బాలిక పొలానికి వెళ్ళిన సమయంలో ఏకంగా 12 మంది.. పట్టపగలే ఆమెను దారుణంగా చంపి, అనంతరం అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సురేంద్ర అనే వ్యక్తితోపాటు మరో 11 మందికి వ్యతిరేకంగా బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్టేషన్ ఆఫీసర్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
అత్యాచారం చేసి.. కిరోసిన్ పోసి తగలెట్టేశారు!
పశ్చిమబెంగాల్ రాజధాని నగరం కోల్కతాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు మరో కొత్త మలుపు తిరిగింది. అక్టోబర్ నెలలో రెండుసార్లు అత్యాచారానికి గురి కావడం, పదే పదే రేపిస్టుల నుంచి బెదిరింపులు ఎదుర్కోవడంతో తట్టుకోలేని 16 ఏళ్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని గత రెండు మూడు రోజులుగా చెబుతున్నారు. అయితే, ఆమెది ఆత్మహత్య కాదు.. హత్య అని ఇప్పుడు పోలీసులు అంటున్నారు. రేపిస్టులే ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టారని తేల్చారు. ఈ మేరకు నిందితులు ఇద్దరిపై తగిన చర్యలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాల్సిందిగా నిందితులు రతన్ సిల్, మింటా సిల్ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. వాళ్లిద్దరూ ఆ కుటుంబం అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కొడుకులు. అయితే, అందుకు ఆమె తిరస్కరించడంతో వాళ్లు కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. పైకి మాత్రం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఇంతకుముందు వారిపై బెదిరింపు కేసు మాత్రమే నమోదైంది. బాధితురాలు మరణించిన ఒకరోజు తర్వాత.. అంటే డిసెంబర్ 24న వారిని పోలీసులు అరెస్టుచేశారు. రెండు రోజుల క్రితం.. మంగళవారం నాడు ఆమె కాలిన గాయాలతో ఆస్పత్రిలో మరణించింది. -
చిన్నారిపై సామూహిక అత్యాచారం - హత్య
బీహార్ రాష్ట్రంలోని రోహతక్ జిల్లాలోని ధరార గ్రామంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం జరిపి అనంతరం హత్య చేశారని జిల్లా ఎస్పీ వికాస్ బర్మన్ శనివారం వెల్లడించారు. ఆ ఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగిందని తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఆ ఘాతుకానికి ఒడిగట్టారని చెప్పారు. ఈ రోజు ఉదయం స్థానికులు ఆ చిన్నారి మృతదేహన్ని వాటర్ ట్యాంక్ వద్ద చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల వివరాలు ఏమి తేలియలేదని తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.