breaking news
Minister Patnam Mahender Reddy
-
మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇంట్లో విషాదం
హైదరాబాద్: 14 ఏళ్లుగా తమ కుటుంబంలో ఒకటిగా మెలిగి తమకు ఎన్నో ఆనందాలు పంచిన పెంపుడు కుక్క మృతితో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.12 కమాన్‌లో నివసించే మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఇంట్లో పెంపుడు శునకం బ్రూనో మృతి చెందింది. దీంతో ఇంటిల్లిపాది తల్లడిల్లిపోయారు. తమ ఇంట్లో ఒకరిగా మెలిగిన బ్రూనో మృతి మహేందర్ రెడ్డి సతీమణి, జెడ్పీ చైర్మన్ పట్నం సునీతారెడ్డిని తీవ్రంగా కలచివేసింది. తాను బ్రూనో మృతితో తీవ్ర మనోవేదనకు గురైన విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. తమ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన అంత్యక్రియలను ఫొటోలను షేర్ చేసుకున్నారు. -
పట్నం మల్లారెడ్డికి కన్నీటి వీడ్కోలు
షాబాద్: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తండ్రి మల్లారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోల్లూరుగూడలో శుక్రవారం జరిగాయి. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మల్లారెడ్డి మనవడు, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవినాష్‌రెడ్డి ఆయనకు దహన సం స్కారాలు నిర్వహించారు. అంత్యక్రియల్లో ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రులు సబితారెడ్డి, ప్రసాద్‌కుమార్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, సంజీవరావు, టీఆర్ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు.