breaking news
Minister kimmena Ratnakar
-
ఆన్లైన్లో ప్రశ్నపత్రాలు
లీకేజీలకు విరగడ మంత్రి కిమ్మెన రత్నాకర్ ప్రశాంతంగా రసాయనశాస్త్రం మరు పరీక్ష బెంగళూరు: ప్రశ్నపత్రాల లీకు సమస్యకు పరిష్కారంగా వచ్చే విద్యా ఏడాది నుంచి పదోతరగతి, పీయూసీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఆన్లైన్ ద్వారా రవాణా చేయనున్నట్లు రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ వెల్లడించారు. విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ ఈ విధంగా ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో రావాణా చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం రీ ఎగ్జామ్ (మరు పరీక్ష) విజయవంతంగా ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యి పరిస్థితిని వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘అన్లైన్లో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలను రవాణా చేయాలంటే సదరు కేంద్రాలకు ఇంటర్నెట్ సదుపాయం ఖచ్చితంగా ఉండాల్సిందే. రాష్ట్రంలో అన్ని పరీక్ష కేంద్రాలకు ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. అటు వంటి సమయంలో ఇంటర్నెట్ ఉన్న పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో పరీక్షా కేంద్రాల సంఖ్య తగ్గిపోతుంది. అందుకు అనుగుణంగా విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు దూరమవుతాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే రవాణాసదుపాయం కల్పించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పెలైట్ ప్రతిపాదికన మొదట కొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ విధానంలో ప్రశ్నపత్రాలను రవాణా చేసి అనంతరం ఈ విధానాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం’ అని కిమ్మెన రత్నాకర్ వివరించారు. అయితే యూనివర్శిటీతో పోలిస్తే రాష్ట్ర విద్యాశాఖ వద్ద నాణ్యమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందన్నారు. అందువల్ల ఆన్లైన్లో ప్రశ్నపత్రం రవాణా చేయడం ఖచ్చితమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం పరీక్షకు సంబంధించి రెండుసార్లు పరీక్ష రోజుకంటే ఒకరోజు ముందుగానే లీకయిననేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రశ్నపత్రాన్ని కూడా మంగళవారం ఉదయం ఎంపిక చేసి అన్ని పరీక్షా కేంద్రాలకు రవాణా చేశారు. పోలీసులతో పాటు రెవెన్యూశాఖ సిబ్బంది కూడా ప్రశ్నపత్రాల రవాణాను పర్యవేక్షించారు. ఇక పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేదాజ్ఞలు జారీ చేశారు. మొత్తంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం పరీక్ష ముగియడంతో అటు విద్యాశాఖ అధికారులతో పాటు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. -
శుభవార్త..
ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మంత్రి హామీ పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల సీఈటీ ద్వారా నియామకాలు దళారుల ప్రమేయం వద్దు బెంగళూరు :ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,200 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేలా ఈ సారి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీఈటీ) నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠ్య పుస్తకాల మార్పు విషయమై బెంగళూరులో గురువారం జరిగిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు టెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన 23 వేల మంది అర్హులేనని అన్నారు. ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించరాదని అభ్యర్థులకు సూచించారు. విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ) అనుసరించి ప్రవేశాలు ఈ ఏడాది నుంచే మొదటిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అందువల్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు పరిష్కారం కనుగొంటామన్నారు. బెంగళూరుతో సహా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయన్నారు. ఈ పాఠశాల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నామని తెలిపారు. కాలానుగుణంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగానే పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. అయితే మతానికి ఈ విషయాన్ని ముడిపెట్టి కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.