breaking news
minister Itala Rajendar
-
మత్స్య పరిశ్రమకు సాయం
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారులకు అన్ని రకాలుగా సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆక్వా ఎక్స్పో ఇండియా 2018 ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడక ముందు మత్స్య పరిశ్రమ అభివృద్ధికి నోచుకోలేదని, కోస్తా తీర ప్రాంతాల మత్స్యకారులను ఒక రకంగా, తెలంగాణ మత్స్యకారులను మరో విధంగా చూసేవాళ్లని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచితంగా సీడ్‌ను అందిస్తుందన్నారు. చేపల సీడ్ ఇవ్వడం నుంచి, అవి పెరిగాక కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి మంచి ధరకు అమ్మేదాక ప్రభుత్వం మత్స్యకారులకు తోడుగా ఉంటుందన్నారు. టెక్నాలజీని వాడుకుని మత్స్య సంపదను పెంచాలన్నారు. మత్య్సకారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని మంత్రి తలసాని అన్నారు. -
కామాంధులను శిక్షించాలి
బాధితురాలిని పరామర్శిస్తున్న కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ర్ట చైర్మన్ ఆరెపల్లి మోహన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జయశ్రీ కామాంధుల కర్కశానికి బలైన యువతికి సంఘీభావాలు వెల్లువెత్తాయి. గ్యాంగ్‌రేప్ సంఘటనపై టీవీల్లో, పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఆదివారం వివిధ పార్టీలు, దళిత, ప్రజా, మహిళా సంఘాల నాయకులు వీణవంక మండలం చల్లూరులో యువతిని పరామర్శించారు. మానవమృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువతిని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి ఈటల రాజేందర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కేసు విచారణలో నిర్లక్ష్యం చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత యువతికి తామున్నామంటూ భరోసానిచ్చారు. కరీంనగర్ : వీణవంక మండలం చల్లూరుకు చెందిన దళిత విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూన శోభారాణి డిమాండ్‌చేశారు. కమాన్‌చౌరస్తాలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు నిందితులకు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీణవంక ఎస్సై, సీఐలను సస్పెండ్ చేయాలన్నారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గూడెం లక్ష్మి, నగర అధ్యక్షురాలు కిన్నెర మల్లమ్మ, పోతుగంటి శారద, సునీత, సమ్మక్క, గాలమ్మ, స్నేహ, రచన, సరోజన పాల్గొన్నారు. అనంతరం దళిత బాధిత మహిళ స్వగ్రామమైన చల్లూర్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు.