breaking news
military governance
-
ఎన్నికలు అనుమానాస్పదం: అమెరికా
వాషింగ్టన్: పాకిస్తాన్లో ఎన్నికలు జరిగిన తీరుపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. సాధారణ ఎన్నికల్లో పారదర్శకత కొరవడిందని.. ఆర్మీ మద్దతున్న పీటీఐ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది. ‘ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని అర్థమవుతోంది. పీటీఐ మినహా మిగిలిన పార్టీల ఏజెంట్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీని ప్రభావమే ఈ ఫలితాలు’ అని అమెరికా విదేశాంగ ఉన్నతాధికారి అలేసా ఎయిర్స్ అభిప్రాయపడ్డారు. ‘ప్రభుత్వం మారుతున్నా పాకిస్తాన్ ప్రజాస్వామ్యం ఇంకా మిలటరీ పాలనలోనే కొనసాగుతుంది. ప్రభుత్వం కేవలం తోలుబొమ్మ మాత్రమే’ అని హెరిటేజ్ ఫౌండేషన్ చీఫ్ జెఫ్ స్మిత్ పేర్కొన్నారు. పలువురు అమెరికా–పాకిస్తాన్ సంబంధాల నిపుణులు కూడా ఎన్నికల్లో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఫలితాలు ముందుగా ఊహించినవేనని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుసేన్ హక్కానీ తెలిపారు. -
మయన్మార్లో కొలువుదీరిన కొత్త సభ
నాపిటా: మయన్మార్లో కొత్తగా ఎన్నికైన వందలాది మంది ప్రజాప్రతినిధులతో పార్లమెంటు కొలువుదీరింది. ప్రజాస్వామిక ఉద్యమ కారిణి ఆంగ్ సాన్ సూచీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ సభ్యులే అత్యధికంగా ఉన్న ఈ పార్లమెంటు.. త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఏళ్ల తరబడి సైనిక పాలనలో మగ్గిన ఈ దేశంలో.. 50 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటు కావటం ఇదే తొలిసారి కానుంది.