breaking news
midnight supply
-
అర్ధరాత్రి మద్యం కొనుగోలు.. పోలీసులు ఏం చేస్తున్నట్టో..
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: అసలే ఎన్నికల సమయం.. ఆపై ఈసారి ఎన్నికల కమిషన్ కఠిన నిబంధనలు అమలవుతున్నాయి.! పోలీసులు శాంతిభద్రతల నిర్వహణ పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంది. అయితే నిజామాబాద్ నగరంలో బందోబస్తు నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత యథేచ్ఛగా బార్లు, హోటళ్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మందుబాబులు రోడ్లపైనే తిరుగుతున్నారు. అత్యవసరం పేరిట, ప్రయాణం చేసి వచ్చే వారిపై వీరితో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణ సమయంలో అర్ధరాత్రి దాటాక మద్యం, బార్లు హోటళ్ల నిర్వహణ విఘాతం కలిగించే అవకాశం ఉంది. పోలీసులు బందోబస్తు పేరిట తనిఖీలు, పెట్రోలింగ్ చేస్తున్నా బార్లు, హోటళ్ల నిర్వహణ మాత్రం కొనసాగుతుండడం గమనార్హం. బయట మూసి, లోపల తెరిచే.. నగరంలో అర్ధరాత్రి తరువాత సైతం మద్యం యథేచ్ఛగా దొరుకుతుంది. నాలుగు ప్రాంతాల్లో బార్ల నిర్వహణ అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగుతుంది. బార్లోనే మద్యం సేవించడమే కాకుండా బయటకు మద్యంను విక్రయిస్తున్నారు. మందుబాబులు రాత్రి సమయంలోనూ కొనుగోళ్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం బార్లు రాత్రి 11 గంటలలోపు మూసివేయాలి. అయితే ఇది అమలు కావడం లేదు. శని, ఆదివారాలు సైతం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు సైతం బార్ల నిర్వహణ కొనసాగుతోంది. బయట నుంచి ప్రవేశ మార్గాలు మూసివేయడం, లోపల నిర్వహణ కొనసాగిస్తున్నారు. పెద్దబజారు, లలితమహాల్ థియేటర్ సమీపంలో, వినాయక్‌నగర్ సమీపంలో ప్రజలకు అనేక అసౌకర్యం కలుగుతోంది. రోడ్లపైనే మద్యం తాగుతున్నారు. వచ్చి పోయే వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. పోలీసులు ఇటువైపు తనిఖీలు చేయకపోవడం గమనార్హం. అలాగే ఒక బార్ మాత్రం అర్ధరాత్రి వరకు నిర్వహణ కొనసాగుతుండగా ఉదయం 7.30 గంటలకే వెనుకవైపు నుంచి మద్యం విక్రయిస్తున్నారు. సమీపంలోనే వైన్స్ షాపు ఉండగా ఇక్కడ ఉదయం పూటనే మద్యం విక్రయాలు జరుగడం గమనార్హం. అర్ధరాత్రి వరకు బార్ల నిర్వహణ ఉండడంతో మందు బాబులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి సమయంలోనే రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దాడులు చోటుచేసుకుంటున్నాయి. మద్యం మత్తులో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. నగరంలో గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. బందోబస్తు ఏమవుతున్నట్టు... నగరంలో పోలీసుల బందోబస్తు రాత్రివేళలోనూ కొనసాగుతోంది. వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధి లో నాలుగు బీట్లు, మూడో, 4వ టౌన్ పరిధిలో నాలుగు బీట్లు పెట్రోలింగ్ కొనసాగుతోంది. బ్లూ కోట్స్ సిబ్బంది, పెట్రోలింగ్ వాహనాలు రాత్రివే ళలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇంతటి బం దోబస్తు నిర్వహిస్తున్న రాత్రివేళలో మాత్రం బారు లు, హోటళ్ల నిర్వహణ కొనసాగుతుండడంపై ప లు విమర్శలు తలెత్తుతున్నాయి. ఎన్నికల సమ యంలో పోలీసులు ఇలాంటివాటిపై చర్యలు తీసుకోకుంటే సమస్యలు ఉప్పతన్నమయ్యే అవకాశం ఉంది. గతంలో రాత్రివేళలో అనేక దాడులు, గొ డవలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అర్ధరాత్రి నిర్వహణపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కఠిన చర్యలు తప్పవు... అర్ధరాత్రి వరకు హోటళ్లు, మద్యం దుకాణాలు నిర్వహణ కొనసాగవద్దు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైన నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. పోలీసు సిబ్బంది రాత్రివేళలో పెట్రోలింగ్ చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. ఇదివరకే పలు హోటళ్లపై కేసులు కూడా నమోదు చేశాం. –శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ -
విద్యుత్ కోతలు
దోమ/ షాబాద్, న్యూస్‌లైన్: బోర్లలో, బావుల్లో సమృద్ధిగా నీరుంది. దీంతో రైతులు పెట్టుబడికి అప్పులు చేసి సాగు మొదలుపెట్టారు. కానీ అప్రకటిత విద్యుత్ కోతలు వారిని నిలువునా ముంచుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే సరఫరా వేళలను తగ్గించారని, ఆరు గంటలు ఇస్తామని మూడు గంటలు కూడా ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దోమ మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులు రబీ సీజన్లో వరి, వేరుశనగ తదితర పంట లను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ముఖ్యంగా వరి నీరందక ఎండుముఖం పడుతోంది. పలు గ్రామాల్లో వేరుశనగ పంటకు కూడా చివరి విడత తడి పెట్టా ల్సి ఉంది. విద్యుత్ కోతల కారణంగా ఈ పంటలు ఎండే పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి సరఫరా అధికారులు బోరుబావులకు ఇస్తున్న కొద్దిపాటి విద్యుత్‌ను కూడా రాత్రి వేళ ఇస్తున్నారు. దోమ సబ్‌స్టేషన్ కింద నాలుగు ఫీడర్లు ఉండగా ఊట్పల్లి, నాచారం ఫీడర్ల పరిధి గ్రామాలకు రాత్రి 9 - 12 గంటల మధ్య, తిరిగి ఉదయం 6 - 9గంటల మధ్య ఇస్తున్నారు. ఇక పాలేపల్లి, బాస్పల్లి ఫీడర్ల కింది పంట లకు తెల్లవారుజామున 3- 6 గంటల మధ్య, తిరిగి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల మధ్య విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దిర్సంపల్లి, గుండాల్ సబ్స్టేషన్ల పరిధిలో ఉన్న ఫీడర్ల కింది పంటలకూ ఇదే తరహా వేళలు. అయితే పేరుకు మాత్రమే ఆరు గంటలని చెబుతున్న అధికారులు పగలు, రాత్రి కలిపి మొత్తం మూడు గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అది కూడా నిరంతరంగా కాదు. విద్యార్థులకు, చిరువ్యాపారులకూ ఇబ్బందే విద్యుత్ కోతలతో రైతులే కాకుండా విద్యార్థులు, చిరువ్యాపారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్, టెన్త్ పరీక్షలు దగ్గరపడుతుండడం, విద్యుత్ కోతలు రోజురోజుకూ అధికమవుతుండడంతో పరీక్షల ప్రిపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతోంది. ఉదయం వేళల్లో గంటల తరబడి కోతలు విధిస్తుండడంతో జిరాక్స్ సెంటర్లు, సామిల్లులు, మెకానిక్ దుకాణాల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. లోఓల్టేజీతో కాలిపోతున్న మోటార్లు షాబాద్ మండలంలో లోఓల్టేజీ సమస్య రైతులను వేధిస్తోంది. తరచూ మోటార్లు కాలి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే కొద్దిపాటి కరెంట్‌తో రెండు మడులు తడుపుకుందామంటే లో ఓల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయంటున్నారు. నెల రోజుల్లో రెం డు బోరుమోటార్లు కాలిపోయాయని, మరమ్మతు చేయించడానికి రూ.10 వేల వరకు ఖర్చు చేశానని షాబాద్ మండల కేంద్రానికి చెందిన రాములు చెప్పాడు.