breaking news
Miami University
-
కుంగుబాటుతో జ్ఞాపకశక్తి సమస్యలు
న్యూయార్క్ : డిప్రెషన్‌తో బాధపడే రోగులు క్రమంగా జ్ఞాపకశక్తి సమస్యలతో సతమతమవుతారని తాజా అథ్యయనం వెల్లడించింది. కుంగుబాటుకు గురైన వారి మెదడు త్వరగా వయసు మీరడంతో మెమరీ సమస్యలు చుట్టుముడతాయని మియామి యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. తీవ్ర కుంగుబాటుకు లోనైన వారికి చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమవుతుందని, వారి మెదడు కుచించుకుపోయి..వయసు మీరే ప్రక్రియ వేగవంతమవుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని చెప్పారు. కుంగుబాటు అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీయకముందే చికిత్స చేయించుకోవాలని పరిశోధకులు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు, అల్జీమర్స్ తీవ్రంగా పెరుగుతున్నాయని వీటికి కారణాలు, చికిత్సపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. అల్జీమర్స్‌తో బాధపడే రోగులు కుంగుబాటుతోనూ సతమతమవుతున్నట్టు తాజా అథ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. కుంగుబాటుకు సత్వర చికిత్స తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి సమస్యలు, అల్జీమర్స్ ముప్పు నుంచి బయటపడవచ్చని సూచించారు. మెదడుపై డిప్రెషన్ పెను ప్రభావం చూపకముందే చికిత్సకు ఉపక్రమించాలని చెబుతున్నారు. కుంగుబాటుతో ఇబ్బందిపడుతున్న 1000 మందిపై మియామీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అథ్యయనం నిర్వహించారు. -
ఎక్స్-కిరణాల గుట్టురట్టు!
వాషింగ్టన్: విశ్వవ్యాప్తంగా ప్రసరిస్తున్న ఎక్స్-రే కిరణాలకు మూలాధారం ఒక్కటి కాదని అమెరికా శాస్త్రవేత్తలపరిశోధనలో వెల్లడైంది. సౌర గాలులు, లోక్ హాట్ బబుల్‌గా పిలిచే శక్తి కేంద్రం నుంచి మాత్రమే ఎక్స్-రే కిరణాలు వెలువడుతున్నాయని గత కొన్ని దశాబ్దాలుగా భావిస్తున్నారు. కానీ, పరిశోధకులకు తెలియని ప్రాంతం నుంచీ ఎక్స్-రే కిరణాలు వెలువడుతున్నాయని, ‘డీఎక్స్ఎల్’ సౌండింగ్ రాకెట్ పంపిన సమాచారాన్ని క్రోడీకరించాక పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా శక్తివంతమైన ఎక్స్-రే కిరణాలు మరేదో ప్రాంతం నుంచి వస్తున్నాయని ధ్రువీకరించారు. పాత సిద్ధాంతంలో మార్పులు చేయాల్సిన అవసరముందని మియామి వర్సిటీ శాస్త్రవేత్త గలేజ్ తెలిపారు. మన సౌరవ్యవస్థ ఆవల విస్తరించి ఉన్న ‘ లోకల్ హాట్ బబుల్’ ప్రాంతం నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాలపై పరిశోధన నిమిత్తం ‘డీఎక్స్ఎల్’ సౌండింగ్ రాకెట్‌ను 2012లో నాసా ప్రయోగించింది.