breaking news
Mehbooba Mufti Sayeed
-
జమ్ము కశ్మీర్: ‘ఆమె మద్దతిస్తే.. తీసుకుంటాం’
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఫలితాలు హంగ్ దిశగా వెలువడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకున్నా పీడీపీ మద్దతు ఇస్తానంటే తాము అంగీకరిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి మద్దతు ఇచ్చేందుకు మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సిద్ధంగా ఉందని వస్తున్న వార్తలపై సోమవారం ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.‘‘జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకపోయినా మద్దతు ఇస్తానంటే తీసుకుంటాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు మనమందరం కృషి చేయాలి. జమ్ము కశ్మీర్ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అయితే ఎన్నికల తర్వాత పొత్తుపై నేను మెహబూబా ముఫ్తీతో మాట్లాడలేదు. నేను ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.#WATCH | Srinagar: JKNC chief Farooq Abdullah says, "Even if we don't need it, we will take the support (from PDP) because if we have to go ahead, we have to do it together. We all have to make an effort to save this state. This state is in a lot of difficulties..." pic.twitter.com/apwy9ZSry1— ANI (@ANI) October 7, 2024 ..మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాం. అయితే ప్రస్తుతానికి నేను ముఫ్తీతో మాట్లాడలేదు. ఆమె మద్దతు ఇస్తానన్న విషయాన్ని పేపర్లలో మాత్రమే చదివాను. ఎగ్జిట్ పోల్స్ గురించి నేను ఉత్సాహంగా లేను. ఎందుకంటే అవి సరైనవి కావోచ్చు. తప్పు కూడా కావచ్చు. ఓట్ల లెక్కింపు తర్వాత అసలు నిజం వెల్లడి అవుతుంది. కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. మా ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.చదవండి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’ -
మహబూబా ముఫ్తీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సయ్యద్కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అయితే ఆమె క్షేమంగా ఉన్నట్లు కూతురు ఇల్తిజా మీడియాకు తెలియజేశారు. గురువారం మధ్యాహ్నాం అనంత్‌నాగ్ జిల్లా సంఘం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ముఫ్తీ ప్రయాణిస్తున్న బ్లాక్ కలర్ స్కార్పియో వాహనం.. మరో కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమెకు ఏం కాలేదని తెలుస్తోంది. అయితే ఆమెకు భద్రతగా వచ్చిన పోలీస్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఖానాబాల్ అగ్నిప్రమాదం బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత ఆమె పరామర్శకు వెళ్లడం గమనార్హం. -
బీజేపీపై మెహబూబా ముఫ్తీ మండిపాటు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కార్‌కు బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్న క్రమంలో కాషాయ పార్టీ చేసిన విమర్శలకు మెహబూబా ముఫ్తీ దీటుగా బదులిచ్చారు. బీజేపీ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. సంకీర్ణ సర్కార్ అజెండాకు బీజేపీ స్వయంగా నీళ్లొదిలిందని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370పై యథాతథ స్థితి, పాకిస్తాన్, హురియత్ నేతలతో చర్చలు సంకీర్ణ అజెండాలో భాగమని పేర్కొన్నారు. ఘర్షణలతో అట్టుడుకుతున్న కశ్మీర్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు విశ్వాసం కల్పించే క్రమంలో రాళ్ల దాడికి పాల్పడిన వారిపై కేసుల ఉపసంహరణ, కాల్పుల విరమణ తక్షణం చేపట్టాల్సిన చర్యలని ఆమె ట్వీట్ చేశారు. జమ్ము, లడఖ్ ప్రాంతాలపై వివక్ష చూపుతున్నామనే బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టారు. జమ్ము నుంచి బీజేపీ మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారని వారి సామర్థ్యాన్ని ఆ పార్టీ సమీక్షించుకోవాలని పేర్కొంది. జర్నలిస్టు షుజత్ బుఖారి హత్య నేపథ్యంలో భాపప్రకటనా స్వేచ్ఛపై బీజేపీ వ్యాఖ్యలను మెహబూబా ముఫ్తీ ఎద్దేవా చేశారు. కథువా లైంగిక దాడి కేసుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఇప్పటికీ జర్నలిస్టులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాగా బీజేపీ, పీడీపీ పరస్పర విమర్శలను మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా ఆక్షేపించారు. రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, బాలీవుడ్ సినిమాలను మరిపించే స్ర్కిప్ట్‌లతో రక్తికటిస్తున్నాయని విమర్శించారు. -
‘దాడులను ప్రతీ ఒక్కరు ఖండించాలి’
న్యూఢిల్లీ : కశ్మీర్లో జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిందేనని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమత్రి ఫరుఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో జరుగుతున్న కాల్పుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ దుశ్చర్యను ప్రపంచ దేశాలు ఖండించాలని ఆయన కోరారు. కాగా కశ్మీర్లో జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్య సమితి స్పందించాలని పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలుకు మద్దతుగా ఫరుఖ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కశ్మీర్లో పరిస్థితి మరింత దిగజారపోయిందని, శాంతి నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం పాక్‌తో చర్చలు ప్రారంభించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్తీ మహ్మాద్ భారత ప్రభుత్వాన్ని కోరిన విషయం విదితమే. -
ముఫ్తీ వారసత్వం
సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితులుండే జమ్మూకశ్మీర్‌లో భిన్న ధ్రువాలైన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ), బీజేపీలు నిరుడు మార్చి నెలలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పర్చినప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అంతకు నాలుగు నెలల ముందు...2014 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకున్న వైరి పక్షాలు రెండూ ఒద్దికగా ప్రభుత్వాన్ని నడపగలవా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. కానీ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు ముఫ్తీ మహ్మద్ సయీద్ బుధవారం కన్నుమూశారు. ఆయనంతగా జమ్మూ-కశ్మీర్లో అన్ని వర్గాల అభిమానాన్నీ చూరగొన్న నేత మరొకరు లేరు. కశ్మీర్ రాజకీయాల్లో ముఫ్తీ లేని లోటు తీర్చలేనిదని పలువురు నాయకులు చేసిన ప్రకటనల్లో నిజముంది. వేర్పాటు వాదానికి దగ్గరగా ఉన్నదని భావించే ‘స్వయంపాలన’ నినాదం ఊపిరిగా ఎన్నికల్లో పోటీచేసిన పీడీపీ...అసలు ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాం గంలోని 370వ అధికరణ రద్దు చేయాలనే బీజేపీతో సన్నిహితం కావడం కేవలం ముఫ్తీ వల్లనే సాధ్యమైంది. ఇందువల్ల తనను సమర్ధించేవారు కొంత అసంతృప్తికి లోనైనా జమ్మూ ప్రాంతంలో అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీని విస్మరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్ర భవిష్యత్తు రీత్యా మంచిది కాదన్న ఉద్దేశం తోనే అందుకు సిద్ధపడ్డానని ముఫ్తీ ఒక సందర్భంలో చెప్పారు. గతంలో ఈ విషయంలో జరిగిన తప్పిదాలవల్లనే రెండు ప్రాంతాలమధ్యా అవసరమైనంతగా సామరస్యత నెలకొనలేదన్న భావన ఆయనలో ఉండేది. అలాగని ఆయన తన అభిప్రాయాల విషయంలోనూ, సిద్ధాంతాల విషయంలోనూ రాజీపడలేదు. సర్కారీ సహకారంతో గోప్యంగా నడిచే హంతక ముఠాలకు సీఎం అయ్యాక ఆయన చోటు లేకుండా చేశారు. విచారణలో ఉన్న రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. అధీన రేఖకు అటూ, ఇటూ ఉండే కశ్మీరీలు ఒకరినొకరు తరచు కలుసుకునే అవకాశం కల్పించారు. వేదిక ఏదైనా తన అభిప్రాయాలను ముఫ్తీ నిర్మొహ మాటంగా చెప్పేవారు. మొన్నటి నవంబర్ నెలలో గోవాలో బీజేపీకి చెందిన మేధావుల ఫోరం సదస్సుకు ఆయన హాజరైనప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్తోసహా విపక్షాలన్నీ విమర్శించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ‘పారదర్శకత, సుపరిపాలన, అభివృద్ధి’ నినాదాలు తనను ఆకర్షించాయనీ, అందువల్లే బీజేపీతో చేతులు కలిపానని ఆ వేదికపైనుంచి ముఫ్తీ అనడమే మీడియాలో ప్రముఖంగా వచ్చింది. కానీ ఆ వేదికపైనే ఆయన బీజేపీని నిశితంగా విమర్శించారు కూడా. మోదీ నినాదంలోని అంశాలన్నీ వెనక్కు వెళ్లి అసహనం ఆధిపత్య స్థానంలోకి వస్తున్న వైనంపై ఆ పార్టీని హెచ్చరించారు. గొడ్డు మాంసాన్ని రవాణా చేస్తున్నాడన్న అను మానంతో ఒక ట్రక్కు డ్రైవర్‌ను కొట్టి చంపిన ఉదంతాన్ని కూడా ఆయన ప్రస్తావిం చారు. దేశం పురోగమించాలంటే సమ్మిళిత అభివృద్ధి ద్వారానే సాధ్యమని హితవు పలికారు. రెండు వర్గాలూ భుజం భుజం కలిపి నడిస్తే దేశం అభివృద్ధి బాట పడుతుందని, అందుకు కశ్మీరే ఉదాహరణని వివరించారు. ఉగ్రవాదం విషయంలోనూ ఆయన అభిప్రాయాలు విలక్షణమైనవి. ప్రజా స్వామ్యమన్నది భావాల సంఘర్షణ అని ముఫ్తీ అనేవారు. ఒకరిని బంధించడం ద్వారా లేదా హతమార్చడం ద్వారా భావాల్లో మార్పు తీసుకురావడం అసాధ్య మన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. కశ్మీరీల వ్యక్తిత్వం గురించి ఇతర ప్రాంతాల వారిలో ఉన్న దురభిప్రాయాలనూ ఆయన ఒక సందర్భంలో ప్రస్తావించారు. 1947లో పాకిస్థాన్ దురాక్రమణను గట్టిగా ప్రతిఘటించిందీ, జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిందీ, తమ అనుబంధం భారత్‌తోనే ఉండాలని ప్రగా ఢంగా కోరుకు న్నదీ కశ్మీరీలేనని ఆయన చెప్పారు. జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రాంతా లను ఒక రాష్ట్రంగా చేయడం బాగానే ఉన్నా జాతి, మత, ప్రాంతీయ స్థాయిల్లో ఉండే ఘర్షణాత్మక ధోరణులను సరిగా పరిష్కరించలేదన్న భావన ఆయనది. వాటిని ఎంతో ఒడుపుగా చేయగలిగినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయనేవారు. దానికి తగినట్టే కూటమి ఏర్పర్చిన సందర్భంలో పీడీపీ, బీజేపీలు రెండూ పట్టు విడుపుల ధోరణిని ప్రదర్శించాయి. తమ తమ వైఖరులను తగ్గించుకుని సన్నిహితమయ్యాయి. తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి కాబోతున్న మెహబూబా ముఫ్తీ ఆ రాష్ట్రానికి తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించబోతున్నారు. తనకు అనారోగ్యం ఏర్ప డ్డాక కుమార్తెను ఆ పీఠంపై కూర్చోబెట్టాలని ముఫ్తీ తహతహలాడారు. మొన్న నవంబర్‌లో ఆ సంగతిని ఆయన ప్రకటించారు కూడా. ఆ పదవికి కావాల్సిన అర్హతలన్నీ ఆమెకున్నాయని ఆ సందర్భంగా ముఫ్తీ చెప్పారు. ‘క్షేత్ర స్థాయిలో పనిచేసేదంతా ఆమెనే...నేను కేవలం ప్రసంగాలకూ, కార్యాలయానికే పరిమితం’ అని కూడా అన్నారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలై, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెహబూబా పీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. మొదట్లో పార్టీ ఉపాధ్యక్షురాలిగా, చాన్నాళ్లనుంచి అధ్యక్షురాలిగా ఉన్న మెహబూబా ముందు ఇప్పుడు చాలా సవాళ్లున్నాయి. పార్టీ అధ్యక్షురాలిగా ఆమె కొన్ని అంశాల్లో బీజేపీతో తీవ్రంగా విభేదించిన సందర్భాలున్నాయి. అవి ఒక్కోసారి రెండు పార్టీలమధ్యా వివాదా లకు కూడా దారితీశాయి. ముఫ్తీ అనుభవశాలి గనుక అలాంటివాటిని అవలీలగా ఎదుర్కోగలిగారు. ఇప్పుడు మెహబూబాయే అలాంటి సందర్భాలు తలెత్త కుండా జాగ్రత్తపడవలసిన స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆమె ఇకపై ఆచితూచి అడుగేయక తప్పదు. ఇప్పుడు శ్రీనగర్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ సాగిస్తున్న చర్చల్లో సహజంగానే మెహబూబా వైఖరి గురించి ప్రస్తావన వచ్చి ఉంటుంది. ముఫ్తీ కేవలం 11 నెలలు మాత్రమే పాలన సాగించారు. అయిదేళ్ల సుదీర్ఘకాలం కూటమి ఒడిదుడుకులు లేకుండా నడవాలంటే కొత్తగా చాలా అంశాల్లో అవగాహనకు రావలసి ఉంటుంది. కీలకమైన నిర్ణయాల విషయంలో పొరపొచ్చాలు ఏర్పడకుండా చూడటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోక తప్పదు. రాష్ట్రంలో కూటమిని జాగ్రత్తగా నడుపుతూ, వివిధ పక్షాలను కలుపుకొనిపోతూ, కేంద్రంలో కావలసినవి రాబట్టుకోవడంలో నేర్పరితనాన్ని ప్రదర్శించిన ముఫ్తీని ఆదర్శంగా తీసుకోగలిగి నప్పుడే మెహబూబా విజయం సాధించగలుగుతారు.