breaking news
maternity leave law
-
ప్రసూతి చట్టంతో భారీగా ఉద్యోగాలు గోవింద
న్యూఢిల్లీ : దేశంలోని మహిళా ఉద్యోగులకు ప్రసూతి ప్రయోజనాలను పెంచుతూ.. వారిని కెరీర్ పరంగా మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది కొత్త ప్రసూతి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టం వల్ల ఇప్పటికే ఆడవాళ్లకు అంతంత మాత్రంగా ఉన్న ఉద్యోగవకాశాలు మరింత సన్నగిల్లినట్టు తెలిసింది. కొత్త ప్రసూతి చట్టం వల్ల మహిళలు ఉద్యోగాలు కోల్పోయారని, చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు మహిళలను నియమించుకోవడం తగ్గించాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ తన అధ్యయనంలో వెల్లడించింది. మార్చి 2019 వరకు 10 రంగాలలో 11 లక్షల నుంచి 18 లక్షల మంది మహిళా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు ఈ అధ్యయనం అంచనావేసింది. ఒకవేళ అన్ని రంగాలను తీసుకుంటే, ఉద్యోగం కోల్పోయిన వారి సంఖ్య కోటి నుంచి 1.2 కోట్ల వరకు ఉంటుందని సర్వే వెల్లడించింది. ఇది భారత్‌కు బ్యాడ్‌న్యూస్ అని పేర్కొంది. అంతేకాక వర్క్‌ఫోర్స్‌లో మహిళల షేర్ 24 శాతానికి పడిపోయిందని కూడా తెలిపింది. ఒకవేళ మహిళా ఉద్యోగుల స్థాయి దేశంలో ఎక్కువగా ఉంటే, దేశ జీడీపీకి 700 బిలియన్ డాలర్లకు పైగా అదనపు సంపద చేకూరుతుందని మెక్నిన్సే అండ్ కో అంచనావేసింది. ఏవియేషన్, ఐటీ, ఐటీ సంబంధిత సర్వీసులు, రియల్ ఎస్టేట్, విద్యా, ఈ-కామర్స్, తయారీ, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసులు, రిటైల్, టూరిజం రంగాలలో 300 ఎంప్లాయిర్స్పై ఈ సర్వేను టీమ్‌లీజ్ సర్వీసెస్ నిర్వహించింది. ఆర్థికంగా మంచిగా ఉన్న కుటుంబాల్లో మహిళలు, బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగం చేయడం లేదని, ఒకవేళ భర్త వేతనం తగ్గిపోతే, అప్పుడు ఉద్యోగం వైపు మొగ్గు చూపుతున్నారని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. 2004 నుంచి 2 కోట్ల మంది మహిళలు తమ ఉద్యోగాలను వదులుకున్నట్టు తెలిపింది. వర్క్ఫోర్స్ల్లో మహిళా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రసూతి చట్టాన్ని సవరించింది. 12 వారాలుగా ఉన్న ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచింది. కానీ చిన్న, మధ్య స్థాయి కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో పనిచేస్తూ ఉంటాయని, ఒకవేళ ఈ కంపెనీల్లో ఐదుగురు మహిళా ఉద్యోగులుంటే, వారి కనుక ప్రసూతి చట్టం కింద 28 వారాల పాటు సెలవు తీసుకుంటే, ఇక సంస్థ నడపడం కష్టతరమవుతుందని తెలిసింది. దీంతో ఈ కంపెనీలు మహిళలను నియమించుకోవడానికి నిరాసక్తి చూపుతున్నట్టు సర్వే వెల్లడించింది. భారత్ లాంటి దేశంలో ఇప్పటికే గర్భవతి అవడాన్ని కెరీర్ కిల్లింగ్‌గా పరిగణిస్తున్నారు. తల్లులైనందున పదోన్నతులు కోల్పోయిన వారు ఉన్నారు. కొత్తగా తల్లులవుతున్న వారు పనిచేసే చోట వివక్షతను ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగుల ఇంటర్వ్యూల సందర్భాల్లోనే పెళ్లి, పిల్లలకు సంబంధించిన ప్రణాళికలను తెలసుకుంటున్నాయి. ఉద్యోగాల్లో చేరిన కొన్నేళ్లవరకు పెళ్లి చేసుకోకూడదని, పెళ్లి చేసుకున్నా పిల్లలు కనకూడదనే షరతులు విధిస్తున్న కంపెనీలు కూడా లేకపోలేదు. -
ప్రసూతి చట్టం.. మహిళల ఉద్యోగాలకు ఎసరు!
న్యూఢిల్లీ: దేశంలోని మహిళా ఉద్యోగులకు 26 వారాలపాటు ప్రసూతి సెలవులను వర్తింప చేస్తూ భారత ప్రభుత్వం ఇటీవల చట్టం తీసుకురావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. అయితే ఇప్పటికే ఆడవాళ్లకు అంతంత మాత్రంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు మరింత సన్నగిల్లుతాయనే ఆందోళన మరోపక్క వ్యక్తం అవుతోంది. ఇదే అంశంపై దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, చిన్న, మధ్యతరహా కంపెనీలు, స్టార్టప్ కంపెనీలకు చెందిన 4,300 మంది అభిప్రాయాలు సేకరించగా, వారిలో 26 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. తాము ఇక మహిళలకు బదులుగా పురుషులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వారు చెప్పారు. 40 శాతం మంది ఎప్పటిలాగే మహిళలను తీసుకుంటామని చెప్పారు. వారి ప్రసూతి సెలవుల కారణంగా తమపై పడే ఆర్థిక భారానితో పోలిస్తే వారు తమకు అవసరమైన సమర్థులా అన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని వారు చెప్పారు. ప్రసూతి సెలవులను పెంచడం వల్ల మహిళల ఉద్యోగావకాశాల్లో ఎలాంటి మార్పు ఉంటుందని తాము భావించడం లేదని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏమీ చెప్పలేమని 12 శాతం మంది చెప్పారు. భారత్ లాంటి దేశంలో ఇప్పటికే గర్భవతి అవడాన్ని కెరీర్ కిల్లింగ్‌గా పరిగణిస్తున్నారు. తల్లులైనందున పదోన్నతులు కోల్పోయిన వారు ఉన్నారు. కొత్తగా తల్లులవుతున్న వారు పనిచేసే చోట వివక్షతను ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగుల ఇంటర్వ్యూల సందర్భాల్లోనే పెళ్లి, పిల్లలకు సంబంధించిన ప్రణాళికలను తెలసుకుంటున్నాయి. ఉద్యోగాల్లో చేరిన కొన్నేళ్లవరకు పెళ్లి చేసుకోకూడదని, పెళ్లి చేసుకున్నా పిల్లలు కనకూడదనే షరతులు విధిస్తున్న కంపెనీలు కూడా లేకపోలేదు. మహిళా ఉద్యోగులకు ఆరు నెలలపాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేయడం, ఓ కంపెనీలో 30 మంది మహిళలు పనిచేస్తున్నా లేదా 50 మంది ఉద్యోగులున్నా కంపెనీలో లేదా 500 మీటర్ల వ్యాసార్ధంలో బీబీ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. అందుకయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని కంపెనీయే భరించాలి. ఈ కారణంగా వ్యాపారంపై, అంటే లాభాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్టార్టప్, చిన్న, మధ్య తరగతి వ్యాపార సంస్థల వ్యాపారవేత్తల్లో 35 శాతం మంది భావిస్తుండగా, ప్రసూతి సెలవులను పెంచుతూ తెచ్చిన చట్టాన్ని 39 శాతం మంది స్వాగతించారు.