breaking news
Mass movie
-
అల్లు అర్జున్ పుష్పని తలదన్నేలా రామ్ చరణ్ మాస్ సినిమా
-
‘రొమాంటిక్’హోలీ.. రంగు పడింది.. ప్రేమ పుట్టింది
హోలీ వచ్చిందంటే ఆ సందడే వేరు. బంధువులు సన్నిహితులంతా ఒక్కచోట చేరి రంగుల్లో మునిగితేలుతూ సంబరాలు చేసుకుంటారు. ఆకాశంలోని ఇంద్ర దనుస్సు నేలకు దిగి వచ్చిందా అనేంతగా ప్రజలంతా రంగుల్లో మునిగిపోతారు. ఇక ఈ పండుగ ప్రత్యేకతను చాటుతూ వెండితెరపై ఎన్నో చిత్రాలు ఆవిష్కృతమయ్యాయి. ముఖ్యంగా ప్రేమికులను కలిపేందుకు ఈ హోలీ పండుగను వేదికగా మలిచిన ప్రేమ కథ చిత్రాలేన్నో. కొట్టు కొట్టు కొట్టు…రంగు తీసి కొట్టు రంగులోన లైఫ్ ఉంది రా… అంటూ కింగ్ నాగార్జున అందాల భామలను పడేశాడు. రంగు రబ్బ..రబ్బ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇలియానాతో కలసి రంగుల్లో మునిగి తేలాడు. రంగేలీ హోలీ…హంగామా కేళీ అంటూ డార్లింగ్ ప్రభాస్ అందాల భామలతో సందడి చేశాడు. ఇలా ప్రేమకథా చిత్రాల్లో హీరోహీరోయిన్ల మధ్య సయ్యాటలు, పాటలకు ఈ రంగుల పండుగను చేర్చి మరితం ఆకర్షనీయంగా మలిచిన ఆ చిత్రాలేంటో ఓ సారి చూద్దాం! ‘మజిలి’లో చై-సామ్ హోలీ! ఈ సినిమా సమంత, హీరో నాగ చైతన్య చాటుమాటుగా ప్రేమిస్తుంది. క్రికెట్ ఆడుతూ తన స్నేహితులతో జాలిగా తిరుగుతున్న హీరోని ఫాలో అవుతూ ఉంటుంది. అతడి అల్లరి చూస్తూ మురిపోతుంటుంది. తన ప్రేమను చెప్పకుండా వన్ సైడ్ లవ్‌లో పడుతుంది. నేరుగా అతడికి ఎదురుపడేందుకు భయపడే సామ్ హోలీ పండగలో మాత్రం ఏకంగా హీరోకి చాటుగా కలర్ పూసి ఆనందపడిపోతుంది. అలా ఎన్నో ప్రేమ కథ చిత్రాల్లో హీరోహీరోయిన్ల ప్రేమకు ఈ హోలీ పండుగ వేదికగా నిలిచింది. నాని-లావణ్యల ‘భలే భలే’ హోలీ భలే భలే మగాడివో చిత్రంలో నాని-లావణ్య త్రిపాఠిల ప్రేమలో కూడా హోలీ పండుగను చేర్చారు. రోడ్డుపై హీరోయిన్ చూసిన నాని అప్పుడే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ వెంటనే మొట్ట మొదటి సారి అంటూ పాట వేసుకుంటాడు నాని. ఇక ఇందులో హీరోయిన్‌తో కలిసి హోలీ ఆడుతూ ఆమెతో ప్రేమ ఆటలు ఆడుతాడు. ఇక ఆ తర్వాత తన మతిమరుపు జబ్బు దాచి హీరోయిన్ ఎలాగోలా ప్రేమలో పడేస్తాడు. ఛార్మితో నాగ్ ‘మాస్’ హోలీ కింగ్ నాగార్జున కెరీర్లో హిట్ సినిమాల్లో ‘మాస్’ సినిమా ఒకటి. అన్నమయ్య, రామదాసు వంటి చిత్రాలతో తర్వాత నాగార్జున యూత్ మంచి క్రేజ్ తీసుకువచ్చిన సినిమా కూడా ఇదే. డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2004లో వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇందులో జ్యోతిక, ఛార్మిలు హారోయిన్లుగా నటించారు. తన పగ కోసం చార్మి ఉంటున్న అపార్ట్మెంట్లో ఉండేందకు వచ్చిన నాగ్ తన ఉనికిని ఎవరికి తెలియకుండ జాగ్రత్త పడతాడు. ఈ క్రమంలో నాగ్ అపార్ట్మెంట్ వాసులకు దగ్గరయ్యేందుకు లారెన్స్ హోలీ పండగను వేదికగా తీసుకున్నాడు. ఈ క్రమంలో కొట్టు కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు అంటూ నాగ్ ‘మాస్’లో ఛార్మితో ఆడిపాడాడు. ఈ పాట తర్వాతే ఛార్మీ నాగ్ ప్రేమలో పడుతుంది. రంగుల్లో భూమిక ప్రేమలో పడ్డ ‘వాసు’ తన ఫ్రెండ్‌ను కొట్టిన విలన్ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు వెళతాడు వెంకటేశ్. అయితే అప్పుడే హీరోయిన్‌తో వెంకి ప్రేమలో పడతాడు. ఈ సీన్ ఆకర్షనీయంగా తీర్చిదిద్దేందుకు రంగుల పండుగను తీసుకున్నాడు డైరెక్టర్. విలన్లను కొట్టేందుకు వచ్చిన వెంకీ రంగుల మబ్బుల్లో చందమామల హీరోయిన్ వైట్ డ్రెస్‌తో ఎంట్రీ ఇస్తుంది. తనపై రంగుల పడకుండా నవ్వుతూ పరుగెడుతుంటే వెంకీ ఆమెను అలా కళ్లార్పకుండా చూస్తునే ఉండిపోతాడు. అలా వైట్ డ్రెస్‌తో చందమామల మెరిసిపోయిన్ హీరోయిన్ భూమికతో లవ్‌లో పడతాడు. అమెరికాలో ‘దేవదాసు’ హోలీ సెలబ్రెషన్స్ రామ్-ఇలియాన వెండితెర ఎంట్రీ ఇచ్చిన చిత్రం దేవదాసు. ఇండియాలో ఉండే రామ్ అమెరికా సెనెటర్ కూతురైన ఇలియానతో ప్రేమలో పడతాడు. ఇండియాకు వచ్చిన మధుతో లవ్‌లో పడ్డ హీరో తన ప్రేమను గెలిపించుకునేందుకు అమెరికాకు వెళతాడు. అక్కడ ఆమెను కలుసుకునేందుకు హోలీని ప్లాన్ చేస్తాడు. హీరోయిన్ను ఎలా అయినా కలవాలి అన్న సాకుతో హోలీ రోజున హీరోయిన్ను తన తండ్రి చేతనే బయటకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేసి కలుస్తాడు. చివరకు హీరోయిన్ తండ్రితో చివరి వరకూ యుద్దం చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు. షామిలిని పడేసేందుకు హోలీని అడ్డుపెట్టుకున్న సిద్దూ ఈ సినిమాలో రిచ్ పర్సన్యాలిటీ అయినటువంటి హీరో, తనకు నచ్చిన షామిలీని ప్రేమించేందుకు అనేక పాట్లు పడుతూ ఉంటాడు. అందులో భాగంగానే షామిలీ కుటుంబంలో ఉన్న పిల్లలను తనకు సపోర్ట్‌గా చేసుకునేందుకు హోలీ పండుగను ఎంపిక చేసుకుని రంగుల్లో మునిగి తేలతాడు. ఇక ఆ పద్దతి నచ్చని షామిలీ తన ఇంట్లో పిల్లల్ని తీసుకెళ్ళి పోయి, హీరోకి పెద్ద షాక్ ఇస్తుంది. అలా ఎన్నో ట్రైల్స్ వేసి హీరో చివరకు ప్రేమ కథను ముగిస్తాడు. -
అందాల ఆరబోతకు ప్రణీత రెడీ
ఎవరు అవునన్నా, కాదన్నా ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాకు గ్లామర్‌తో పాటు డ్యూయెట్స్ అవసరమే. చిత్ర కథలో ఎంత దమ్ము ఉన్నా యువతను అలరించేదిపై రెండు విషయాలే. అందుకే దర్శక నిర్మాతలు కథకు అవసరం లేకపోయినా గ్లామర్‌ను క్రియేట్ చేసి మరీ చిత్రాల్లో జొప్పిస్తుంటారు. అసలు విషయానికొస్తే దర్శకుడు వెంకట్‌ప్రభు కూడా మాస్ చిత్రంలో గ్లామర్ కోసమే ఒక హీరోయిన్ పాత్రను సృష్టించారనే టాక్ వినిపిస్తోంది. సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం మాస్. ఇందులో ఒక సూర్య సరసన నటి నయనతార నటించారు. మరో సూర్య కోసం తొలుత ఎమిజాక్సన్ను ఎంపికచేశారు. అయితే ఆ చిత్రంలో తనకు ప్రాముఖ్యత లేదంటూ ఆమె వైదొలిగారు. దీంతో నటి ప్రణీతను ఎమిజాక్సన్ పాత్రకు ఎంపిక చేశారు. అయితే ఈ చిత్రం కోసం నయనతార పాటల సన్నివేశాల్లో మినహా ఎలాంటి సన్నివేశంలోనూ గ్లామరస్‌గా నటించేది లేదని ఖరాఖండిగా చెప్పారట. దీంతో అందాలారబోత కోసమే నటి ప్రణీతను వాడుకున్నారని సమాచారం.తెలుగులో అత్తారింటికి దారేది చిత్రంలో నటించినా ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రంలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అది ప్రణీత స్వయం కృతాపరాధమేననే ప్రచా రం జరిగింది. దీంతో అక్కడ అవకాశాలు లేవు. సరిగ్గా అలాంటి సమయంలో సూర్య కు జంటగా మాస్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఒకే చెప్పారని సమాచారం. పెద్ద హీరో చిత్రం కావడంతో మళ్లీ కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చుననే ఆరాటంతోనే ప్రణీత మాస్లో నటించడానికి సమ్మతించినట్టు సమాచారం. ఆమె అందాలు మాస్ చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.