తక్కువ పొగుడుతారట!
వాషింగ్టన్: ప్రొఫెసర్లను విద్యార్థులు తరచూ మేధావులు, తెలివైన వారు అని పేర్కొంటారు. అయితే మహిళా ప్రొఫెసర్ల కన్నా పురుష ప్రొఫెసర్లనే విద్యార్థులు ఎక్కువగా పొగుడుతారని ఓ అధ్యయనంలో తేలింది. మహిళా ప్రొఫెసర్లు, ఆఫ్రికన్ అమెరికన్లను చాలా తక్కువ సార్లు మేధావులుగా పేర్కొంటారని తెలిపింది.
ఈ పరిశోధన కోసం రేట్మైప్రొఫెసర్స్ డాట్కామ్ వెబ్సైట్లో తమ తమ ప్రొఫెసర్లపై దాదాపు 1.4 కోట్ల విద్యార్థుల అభిప్రాయాలు తీసుకున్నారు. ‘మహిళా ప్రొఫెసర్ల కన్నా పురుష ప్రొఫెసర్లనే ఎక్కువ సార్లు ‘జీనియస్’, ‘బ్రిలియంట్’ అని పేర్కొంటుంటారని మా అధ్యయనంలో తేలింది’ అని అమెరికాలోని ఇల్లినాయీ యూనివర్సిటీకి చెందిన డానియెల్ స్టోరేజి చెప్పాడు.