breaking news
Malad Railway Station
-
మయాంక్ లేవరా ప్లీజ్.. సెకన్ల గ్యాప్‌లో లోకల్ ట్రైన్ ఢీకొనడంతో..
ముంబై: మనిషి చేసే చిన్న చిన్న తప్పిదాలు వారి ప్రాణాల మీదకు తెస్తాయి. సెకన్ల వ్యవధిలో ప్రాణాలుపోయే పరిస్థితి వస్తుంది. రైలు ఎక్కే సమయంలో దిగే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సోషల్ మీడియా కారణంగా రీల్స్, వీడియోలు అంటూ కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రైలు ఓ యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు స్పాట్లోనే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌పై ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ కూర్చున్నారు. వారంతా అక్కడే టిఫిన్ తిన్నారు. ఓ కుర్రాడు పైకి లేచి ప్లాట్ ఫామ్ చివరగా వెళ్లి చేతులు కడుక్కున్నాడు. ఇంతలో అతడి ఫ్రెండ్ మయాంక్ అనిల్ శర్మ(17) కూడా చేతులు కడుక్కోవడానికి ప్లాట్ ఫామ్ అంచువరకు వెళ్లాడు. మరో స్నేహితుడు తన చేతులు కడుక్కుని వాటర్ బాటిల్లోని నీరు తాగి. ఆ తర్వాత బాటిల్‌ని అనిల్‌కు ఇచ్చాడు. అనిల్ తన చేతులు వాష్ చేసుకుంటున్నాడు. ఇంతలో ప్లాట్‌ఫామ్-3పైకి లోకల్ ట్రైన్ దూసుకొచ్చింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్ అంచునే ఉన్న మయాంక్‌ను గట్టిగా ఢీకొనడంతో ఒక్కసారిగా గాల్లోకి లేచి కిందపడిపోయాడు. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ఈ క్రమంలో స్పాట్లోనే మయాంక్ మృతిచెందాడు. మరో స్నేహితుడికి గాయలయ్యాయి. అయితే, ఈ ప్రమాదం జూన్ 17వ తేదీన చోటుచేసుకుంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ప్లాట్‌ఫాంలపై జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హాయ్ అంటూ దగ్గరయ్యాడు.. నమ్మకంతో ఆమె వీడియో కాల్స్ చేసి.. -
రాజ్‌ఠాక్రే కార్యకర్తలను చితక్కొట్టారు..
ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) కార్యకర్తలను చిరువ్యాపారులు శనివారం చితక్కొట్టారు. రాజ్ ఠాక్రే పార్టీకి చెందిన 15 మంది కార్యకర్తలు నగరంలోని మలడ్ రైల్వే స్టేషన్ వద్ద దురాక్రమణలను పరిశీలించేందుకు వెళ్లారు. రైల్వే స్టేషన్ పరిధిలోని భూమిలో అక్రమంగా నిలిపిన దుకాణాలను తొలగించాలని వారికి చెప్పారు. దీంతో ఆగ్రహించిన 100 మంది చిరు వ్యాపారులు వారిపై రాడ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంజయ్ నిరుపమ్ మలడ్ రైల్వే స్టేషన్ పరిధిలోని చిరు వ్యాపారులతో సమావేశమైన తర్వాత వారు దాడికి పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది. చిరు వ్యాపారుల దాడిలో ఓ ఎమ్ఎన్ఎస్ కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) దురాక్రమణకు గురైన రైల్వే స్థలాలపై ప్రచార కార్యక్రమాలను ఆపబోమని పేర్కొంది.