breaking news
mak a wish foundation
-
బ్రెయిన్ ట్యూమర్ చిన్నారి శ్రీజతో పవన్ కళ్యాణ్
-
శ్రీజకు రెండు లక్షలు, బొమ్మలు ఇచ్చిన పవన్
హైదరాబాద్ : బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీజ (13)ను సినీనటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం పరామర్శించారు. ఖమ్మం కార్తీక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పవన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి ఆస్పత్రిలోని వైద్యులను అడిగి తెలుసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా శ్రీజకు రూ.2లక్షల చెక్కుతో పాటు, బొమ్మలను అందచేశాడు. అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయల్దేరారు. విశాఖలో తుఫాను బాధితులను పరామర్శించిన అనంతరం హైదరాబాద్ వస్తూ మార్గమధ్యంలో ఖమ్మం వెళ్లి, అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను పవన్ పరామర్శించారు. తనకు పవన్ కల్యాణ్ ను కలవాలని ఉందని శ్రీజ చెప్పడంతో మేక్ ఎ విష్ ఫౌండేషన్ సభ్యులు పవన్ కు సమాచారం అందించి ఆమె కోరిక తీర్చారు. -
పవన్ కళ్యాణ్‌కు తప్పిన ప్రమాదం
ఖమ్మం : సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు కొణిజర్ల వద్ద స్వల్ప ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ వాహనం ముందుభాగం స్వల్పంగా ధ్వంసమైంది. దాంతో ఆయన మరో కారులో ఖమ్మం బయల్దేరి వెళ్లారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న శ్రీజ అనే పదమూడేళ్ళ చిన్నారిని పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు ఖమ్మం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా శ్రీజకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. అభిమాన నటుడిని చూడాలని ఆమె ఆకాంక్ష. అయితే ఆమె ప్రస్తుతం ఖమ్మంలోని కార్తీక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీజ కదలలేని పరిస్థితిలో ఉండటంతో మేక్ ఏ విష్ స్వచ్ఛంద సంస్థ విజ్ఞప్తితో ఆమెను చూసేందుకు పవన్ కళ్యాణే ఖమ్మం వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను ఆయన పరామర్శించి ఆమె కోరికను తీర్చారు.