మెజార్జీ ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయం: గద్దర్
హైదరాబాద్: ‘ఉద్యమపాటగా కొనసాగుతున్నా, మెజార్జీ ప్రజ లు ఆకాంక్షించిన మేరకు విధానపత్రం, వేదిక నిర్మాణం జరిగితే వరంగల్ ఉప ఎన్నికలో నా వంతు పాత్ర పోషిస్తాను.’ అని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ అల్వాల్ భూదేవినగర్‌లోని గద్దర్ నివాసంలో పలువురు ప్రజాసంఘాల, దళిత సంఘాల నాయకులు గద్దర్‌ను కలసి వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక విషయమై చర్చించారు.
కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని, మరికొందరు వామపక్షాల అభ్యర్థిగా బరిలో ఉండాలని సూచించారు. కొందరు ఎన్నికల బరిలో నిలబడొద్దన్నారు. సమావేశం అనంతరం గద్దర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు పూర్తయినప్పటికీ పెత్తందారులు, భూస్వామి వర్గాలు పాలక వర్గాలుగా మారాయన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీపై మెజార్టీ ప్రజలు ఆకాంక్షల మేరకు నడుచుకుంటానని చెప్పారు.