breaking news
maitreya
-
మళ్లీ మణిపూర్లో నిప్పు
ఇంపాల్/గువాహటి: మెజారిటీ మైతేయ్లకు రిజర్వేషన్లను కల్పించాలన్న నిర్ణయంతో రాజుకున్న అగ్గికి 200 మందికిపైగా బలైన ఉదంతం నుంచి తేరుకుంటున్న మణిపూర్లో మళ్లీ విద్వేషాగ్ని రాజుకుంటోంది. గత వారం అపహరణకు గురైన ఆరుగురి మృతదేహాలు తాజాగా నదిలో బయటపడటంతో మైతేయ్ వర్గాల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది.మైతేయ్ అనుకూల అల్లరిమూకలు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులకు తెగబడ్డాయి. నిరసనలు, ఆందోళనలు ఒక్కసారిగా ఉధృతమవడంతో పుకార్లు, తప్పుడు వార్తల ప్రచారానికి అడ్టుకట్టవేసేందుకు మణిపూర్ ప్రభుత్వం వెంటనే ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. ఘర్షణాత్మక, సున్నిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కంగ్పోక్పీ, చురాచాంద్పూర్ జిల్లాల్లో నెట్సేవలను ఆపేశారు. అసలేం జరిగింది? కుకీ–జో వర్గానికి చెందిన గ్రామవలంటీర్లుగా చెప్పుకునే 11 మంది సాయుధులు బొరోబెక్రా ప్రాంతంలోని పోలీస్స్టేషన్పైకి దాడికి తెగించారు. అయితే భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో ఈ 11 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా మైతేయ్ వర్గానికి చెందిన వారిని కుకీ సాయుధమూకలు నవంబర్ 11వ తేదీన అపహరించాయి. అపహరణకు గురైన వారిలో ఆరు గురి మృతదేహాలు శుక్రవారం జిరిబామ్ జిల్లాలో లభించాయి. అస్సాం–మణిపూర్ సరిహద్దు వెంట ఉన్న జిరిముఖ్ గ్రామ సమీప జిరి, బారక్ నదీసంగమ ప్రాంత జలాల్లో ఈ మృతదేహాలను కనుగొన్నారు. ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళల మృతదేహాలు లభించడంతో మైతేయ్ వర్గాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ఇంఫాల్ లోయలోని చాలా ప్రాంతాల్లో వేలాది మంది నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు ఎమ్మెల్యేల నివాసాలపై మైతేయ్ వర్గీయులు శనివారం దాడులకు తెగబడ్డారు. ముగ్గురు రాష్ట్రమంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలపై ఇళ్లపై దాడులు చేశారు. ఎమ్మెల్యే నిశికాంత్ ఇంటిపై దాడిచేశారు. -
మైత్రేయను కాపురానికి రమ్మనండి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: వర్ధమాన నటి మైత్రేయను తాను వివాహం చేసుకున్నానని సంచలన ప్రకటన చేసిన కన్నడ దర్శకుడు రుషి.. మైత్రేయ తనతో కలసి ఉండడం లేదని, తనతో కాపురం చేయాల్సిందిగా ఆమెను ఆదేశించాలని కోరుతూ ఇక్కడి కుటుంబ కోర్టులో అర్జీ దాఖలు చేశారు. రైల్వే మంత్రి సదానందగౌడ తనయుడు కార్తీక్గౌడపై అత్యాచారం, వంచన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా మైత్రేయ వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. -
మైత్రేయ మేలి పలుకులు
‘జీవితాన్ని జీవించు, గడిపేయొద్దు’... ‘జీవించే జీవితాన్ని ప్రేమిస్తే, ప్రేమించే జీవితాన్ని జీవిస్తావు’.... స్వామి మైత్రేయ ప్రేమ సంబంధమైన జీవితాన్ని, ఆనందమయ జీవితాన్ని జీవించడానికి మనస్సును ఎలా శుద్ధి చేసుకోవాలో బోధించే యోగి పుంగవులు. పలు మాధ్యమాల ద్వారా ధ్యానాన్ని ప్రచారం చేయడమే కాదు సఫలవంతమైన జీవితానికి అవసరమైన సూక్తులను కూడా ఆయన అందిస్తూ ఉంటారు. అలాంటి వాటన్నింటినీ సేకరించి ఆయన శిష్యురాలు స్వప్న మల్లిక్ వేసిన పుస్తకం ఇది. ‘స్వర్గం చావు తర్వాత వచ్చేది కాదు, ఈ క్షణంలో చూడగలిగే నీ అంతరాత్మ దర్శనమే’.... ‘చైతన్యంతో ఉంటే దాదాపు అన్ని రోగాలూ మాయమవుతాయి’ వంటి అనేక కాంతి కిరణాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. చీకట్లో ఉన్నవారికి ఇది వెలుగు ఇచ్చే దీపమే. మైత్రేయ మేలి పలుకులు; వెల: రూ. 65; ప్రతులకు: 09686488116