breaking news
Mahima makvan
-
ఎవరో ఎవరో ఎదురుగ కలలా..!
ఆగస్టు 28న విశాఖ, భీమిలి బీచ్‌లో చైత్ర అనే అమ్మాయి శవం పోలీసులకు కనిపిస్తుంది. చైత్రను ఎవరు చంపారు? ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆనందేనా? హత్యకు ముందు ఏం జరిగింది? అనే కథతో రూపొందిన సినిమా ‘వెంకటాపురం’. ‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్, మహిమా మక్వాన్ జంటగా వేణు దర్శకత్వంలో ‘శ్రేయాస్’ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులోని ‘ఎవరో ఎవరో ఎదురుగ కలలా.. కలలా..’ అనే మొదటి పాటను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మంగళవారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రేక్షకుల ఊహకు అందని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా. రాహుల్ లుక్, న్యూ మేకోవర్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది’’ అన్నారు. అజయ్, జోగి బ్రదర్స్, శశాంక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: సాయిప్రకాశ్, సంగీతం: అచ్చు. -
చిన్న చిత్రాలు మరిన్ని రావాలి
– అల్లు అరవింద్ ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాలు మరిన్ని రావాలి. అప్పుడే ఇండస్ట్రీలో పదిమందికి పని దొరుకుతుంది. చిన్న సినిమాలు మంచి కథతో తీస్తున్నారు. శ్రేయాస్ శీను, ఫణిలకు సినిమా అంటే ప్యాషన్. చిన్న చిత్రాలు తీసి, సక్సెస్ సాధిస్తున్నారు’’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ‘హ్యాపీడేస్’ ఫేం రాహుల్, బాలీవుడ్ టీవీ నటి మహిమా మక్వాన్ జంటగా వేణును దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రేయాస్ శీను, ఫణి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వెంకటాపురం’. ఈ చిత్రం ట్రైలర్‌ను అల్లు అరవింద్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథను దర్శకుడు తనదైన స్కీన్ర్ప్లేతో ఎంటర్టైనింగ్గా చూపించబోతున్నారు. మా చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ చూసి సినిమా ఇండస్ట్రీ పెద్దలు అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. రాహుల్ విభిన్నంగా కనిపించబోతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. రాహుల్, నిర్మాత ‘జెమిని’ కిరణ్, నటుడు–దర్శకుడు అవసరాల శ్రీనివాస్, దర్శకుడు ‘డార్లింగ్’ స్వామి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్, సంగీతం: అచ్చు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: తాళ్లూరి ఆనంద్, లైన్ ప్రొడ్యూసర్: కె.అరుణ్ మోహన్.