breaking news
Mahendra Prasad
-
రాజ్యసభ ఎంపీ మహేంద్రప్రసాద్ కన్నుమూత
న్యూఢిల్లీ: జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్రప్రసాద్ (81) ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతికి ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సంతాపం ప్రకటించారు. అరిస్టో ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడైన మహేంద్రప్రసాద్‌కు పార్లమెంట్ సభ్యుల్లో అత్యంత ధనికుల్లో ఒకరిగా పేరుంది. మహేంద్ర బిహార్ నుంచి 7 పర్యాయాలు రాజ్యసభకు, ఒక విడత లోక్‌సభకు ఎన్నికయ్యారు. (చదవండి: చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు) -
దేశంలో ధనిక ఎంపీ ‘కింగ్’ మహేంద్ర!
సాక్షి, పాట్నా : రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థులంతా విధిగా తమ ఆస్తులను ప్రకటిస్తున్న నేపథ్యంలో అత్యంత సంపన్న నేతగా జేడీయూ (బిహార్)కు చెందిన మహేంద్ర ప్రసాద్ నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్న జయా బచ్చన్ రూ.1000 కోట్ల ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించి ధనిక ఎంపీగా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్స్ పరిశీలన పూర్తికాగా రూ.4,039 కోట్ల ఆస్తులతో జేడీయూ అభ్యర్థి, ఎంపీ మహేంద్ర అగ్రస్థానంలో నిలిచారు. దాంతో సంపన్న ఎంపీల జాబితాలో జయా బచ్చన్ రెండో స్థానానికి పడిపోయారు. 58 స్థానాల కోసం మార్చి 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. జేడీయూ తరఫున మూడోసారి రాజ్యసభకు వెళ్లనున్న మహేంద్ర ప్రసాద్ ఓవరాల్‌గా ఏడోసారి ఎగువ సభలో అడుగుపెట్టనున్నారు. కింగ్ మహేంద్రగా పేరు గాంచిన మహేంద్ర ప్రసాద్.. తన అఫిడవిట్లో రూ.4,010.21 కోట్ల చరాస్తులు, రూ. 29 కోట్ల స్థిరాస్తులు కలిగిఉన్నట్లు వెల్లడించారు. మాప్రా లాబోరేటరిస్ ప్రైవేట్ లిమిటెడ్, అరిస్టో ఫార్మాసూటికల్స్ కు అధిపతిగా ఉన్నారు. సొంత వాహనమే లేని ధనిక ఎంపీ నాలుగు వేల కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్న ఎంపీగా ఉన్న మహేంద్రకు ఒక్క వాహనం కూడా లేదని తెలిపారు. తన పేరుతో ఒక్క ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తొలిసారి 1980లో కాంగ్రెస్ అభ్యర్థిగా నెగ్గి పార్లమెంటులో అడుగుపెట్టిన మహేంద్ర ప్రసాద్.. తాజాగా ఏడోసారి రాజ్యసభలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. జేడీయూ నుంచి బరిలో నిలిచారు. 211 దేశాల్లో పర్యటించిన ఏకైక ఎంపీగా ఆయనదే రికార్డ్.