breaking news
maha nandi
-
మనకూ ఉంది..ఓ మహానంది
సాక్షి, కొడంగల్ : ఆలయం చిన్నదైనా కర్నూలు జిల్లా మహానందిలో మాదిరి మన జిల్లాలో ఒకటి అలాంటి ఆలయం ఉంది. నిరంతరం జలధార నంది నోటి నుంచి వస్తూ పరమేశ్వరుడికి జలాభిషేకం చేస్తున్న దృశ్యం కొడంగల్ మండలం కస్తూరుపల్లి గ్రామ సమీపంలో కనిపిస్తోంది. కస్తూరుపల్లి అటవీప్రాంతంలో కొలువైన లొంక బసవేశ్వర ఆలయంలో ఆ దృశ్యం కనిపిస్తుంది. కొడంగల్ మండలంలోని కస్తూరుపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో లొంక బసవేశ్వర ఆలయం ఉంది. నంది నోటిలోంచి గలగలా పారుతూ గంగమ్మ సందడి చేస్తుంటుంది. మహానందిలో నంది నోటినుంచి నీరు ఎలా వస్తుందో ఇక్కడ కూడా అలాగే వస్తోంది. లొంక బసవేశ్వర ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో హాజరై పూజలు చేస్తుంటారు. బసవేశ్వర ఆలయ సమీపంలోకి ఎవరైనా భక్తి, నిష్టతో వెళ్లకపోతే ఆ నీరు ఆగిపోతుందని అక్కడి వారి నమ్మకం. మహిమాన్విత ఆలయంగా లొంక బసవేశ్వర ఆలయం గుర్తింపు పొందుతోంది. అయితే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. -
మహానందికి పోటెత్తిన భక్తులు
మహానంది: కర్నూలు జిల్లా మహానందీశ్వరుడి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. దాదాపు 60 వేల మంది భక్తులు నందీశ్వరుడి దర్శనం కోసం వేచి ఉన్నారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు ఈ రోజు స్వామిని దర్శించుకున్నారు. వారి కోసం భక్తుల దర్శనాలను అరగంట సేపు నిలిపివేయడంతో భక్తులు దేవస్ధానం సిబ్బందిపై మండిపడ్డారు.