breaking news
madura
-
కరోనా భయం; యువతిపై అమానుషం!
నోయిడా: ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతి పట్ల బస్సు కండక్టర్, డ్రైవర్ మానవత్వం మరిచి ప్రవర్తించారు. సదరు యువతిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారు ఆమెను బస్సు నుంచి తోయడంతో గుండెపోటుతో మరణించిందని కుటుంబ సభ్యులు మధుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. 19 ఏళ్ల అన్షీక తన తల్లితో కలిసి యూపీ రోడ్‌వేస్ బస్సులో నోయిడా నుంచి షికోహాబాద్ వెళ్తుంది. మధుర సమీపంలో అన్షీక ఎండ కారణంగా అలసటగా ఉండటంతో మూర్చపోయింది. దీంతో ఆమెకు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో కండక్టర్, డ్రైవర్ మధుర వద్ద బస్సు నుంచి ఆమెను తోసేయయడంతో యువతి మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు మాంట్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ భీమ్ సింగ్ తెలిపారు. (గ్రేటర్లో కరోనా విజృంభణ.. జనం హైరానా ) పోస్టుమార్టం రిపోర్టులో అన్షీక గుండెపోటుతో మరణించినట్లు వెల్లడైంది. అన్షీకను బస్సు నుంచి కిందకు తోసే క్రమంలో డ్రైవర్, కండక్టతో వాదన జరుగిందని, అప్పుడే అన్షీకకు గుండెపోటు వచ్చి ఉంటుందని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. ఇది సహజ మరణం కిందకు వస్తున్నందున ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సింగ్ పేర్కొన్నారు. ఇక మృతురాలి సోదరుడు మాట్లాడుతూ.. బస్సు ఎక్కేటప్పుడు తన సొదరి బాగానే ఉందని, ఎండకారణంగా అలసిపోయి మూర్చపోయిందని చెప్పాడు. దీంతో బస్సు మొత్తం తను కరోనా వైరస్ సోకినట్లుగా ప్రవర్తించడంతో డ్రెవర్, కండక్టర్ తన సోదరిని వేధించడం ప్రారంభించారని తెలిపాడు. ఆ తర్వాత తనని దుప్పటితో చుట్టి బస్సులోంచి విసిరారని ఆవేదన వ్యక్తం చేశాడు. (విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో మరో మలుపు ) -
మెగా వేడుక
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మొదటి హీరోయిన్ నీహారిక. మెగా బ్రదర్ ముద్దుల తనయ అయినా నీహా ఇప్పటికే బుల్లితెరపై తన టాలెంట్‌ని నిరూపించేసుకున్నారు. ‘ఒక మనసు’ ద్వారా వెండితెరకు పరిచయం కానున్నారు. రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుకకు ముహూర్తం ఖరారైంది. సునీల్ కశ్యప్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల వేడుక ఈ నెల 18న ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్ ముఖ్యఅతిథులుగా విచ్చేయనున్నారు. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
వర్ణ రంజితమైన మధుర
మధుర : శ్రీకృష్ణలీలకు ప్రసిద్ధి చెందిన మధుర వర్ణరంజితం అయ్యింది. ఇక్కడ హోలీ పండుగను వినూత్న రీతిలో జరుపుకుంటున్నారు. హోలీ రోజున భంగ్ సేవించడం ఇక్కడి సంప్రదాయం. ఆ పద్ధతిని కొనసాగిస్తూ భంగ్ తయారు చేసిన స్థానికులు తోటివారితో కలిసి ఆ భంగ్ సేవిస్తూ ఆనంద పరవశులవుతున్నారు. రంగులు చల్లుకుంటూ, పడవలపై డోలక్లు వాయిస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక శ్రీకృష్ణుడి లీలామృతాలకు పెట్టింది పేరైన బృందావనం ఆనంద పరవశంలో మునిగితేలుతోంది. రంగుల లోకంలో విహరిస్తూ తన్మయత్వం పొందుతోంది. రంగుల పండుగ హోలీ సంబరాలు బృందావనంలో అంబరాన్నంటుతున్నాయి. వేలమంది ఒకే చోట చేరి రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో హోలీ సంబరాలు వినూత్నంగా సాగుతున్నాయి. చారిత్రక మహంకాళీ దేవాలయంలో హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సాధారణంగా ఆలయ గర్భ గుడిలో రంగులు చల్లడం ఎక్కడా చూసి ఉండరు. కానీ మహంకాళీ ఆలయం మాత్రం ఇందుకు విభిన్నం. ఇక్కడి ఆలయంలో రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. గర్భగుడిలో శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తూనే రంగులు చల్లుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆనందంతో చిందులేస్తూ గంతులేస్తున్నారు. రంగుల లోకం ఆవిష్కృతమవుతోంది. సమస్త భారతవాని సప్త వర్ణ శోభితమవుతోంది. చిన్నా, పెద్దా, కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలుతున్నారు. రాజస్థాన్ రంగుల్లో మునిగిపోతోంది. చారిత్రక ఉదయ్‌పూర్‌లో వర్ణాలు విరగబూస్తున్నాయి. స్థానికులతో చేరిన విదేశీయులు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు రంగుల లోకంలో విహరిస్తూ తన్మయత్మం పొందుతున్నారు. ఒకే చోట చేరి వందలమంది రంగులు చల్లుకుంటూ.... పాటలు పాడుతూ... నృత్యాలు చేస్తూ సంతోషం పంచుకుంటున్నారు. బాణాసంచా పేలుళ్లు పండుగ సంరంభానికి కొత్త ఆకర్షణ తీసుకొస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ అంతటా రంగులు విరబూస్తున్నాయి. సిలిగురిలో హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. చిన్నా, పెద్దా రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు చేస్తూ హోరెత్తిస్తున్నారు. విదేశీయులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. వాణిజ్య రాజధాని వర్ణాల్లో మునిగిపోతోంది. యువత రంగల లోకంలో విహరిస్తోంది. బాలబాలికలు, స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ గంతులేస్తున్నారు. ఇక నిత్యం సరిహద్దుల్లో కాపలా కాస్తూ శత్రుమూకల దాడిని పసిగట్టడంలో గస్తీ తిరుగుతూ ఉండే సైనికులకు కొన్ని సందర్బాల్లోనే ఆటవిడుపు దొరుకుతుంది. రంగుల పండుగ వస్తే వారి ఆనందానికి అడ్డే ఉండదు. ఈ పండుగ వేళ జవాన్లు కూడా రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. పరస్పరం రంగులు పులుముకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషం పంచుకున్నారు. కాగా హోలీ సంబరాలను వివిధ ప్రాంతాల్లో కొందరు ఆదివారం జరుపుకోగా, మరికొందరు సోమవారం నిర్వహించారు.