breaking news
Madrid Open Tourney
-
మాడ్రిడ్ ఓపెన్‌కు సెరెనా దూరం
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ రేపటి (శనివారం) నుంచి జరిగే మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ నుంచి వైదొలగింది. ‘తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నేను మాడ్రిడ్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నాను’ అని సెరెనా తన వెబ్సైట్లో తెలిపింది. దీంతో ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు సన్నాహకంగా ఆమె రోమ్ ఓపెన్‌లో బరిలోకి దిగే అవకాశముంది. ఈ నెల 13 నుంచి 20 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. -
రోమ్ ఓపెన్‌లోనూ షరపోవాకు వైల్డ్ కార్డు...
రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు మరో టోర్నమెంట్లో వైల్డ్ కార్డు ఎంట్రీ లభించింది. ఇప్పటికే స్టుట్గార్ట్, మాడ్రిడ్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు షరపోవాకు వైల్డ్ కార్డు కేటాయించగా... తాజాగా రోమ్ ఓపెన్‌లోనూ ఆమెకు ఈ అవకాశం దక్కింది. నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్లు తేలడంతో 2016 జనవరిలో షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) రెండేళ్లపాటు నిషేధం విధించింది. అయితే కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ జోక్యంతో ఈ రష్యా స్టార్ నిషేధాన్ని ఐటీఎఫ్ 15 నెలలకు కుదించింది. నిషేధం గడువు పూర్తయిన వెంటనే... ఏప్రిల్ 26న మొదలయ్యే స్టుట్గార్ట్ ఓపెన్‌లో షరపోవా పునరాగమనం చేయనుంది. ఆ తర్వాత మే 6 నుంచి 13 వరకు జరిగే మాడ్రిడ్ ఓపెన్‌లో, మే 15 నుంచి 21 వరకు జరిగే రోమ్ ఓపెన్‌లో ఆమె ఆడుతుంది.